spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP: కాపు నేతలకు వైసీపీ ఫోన్లు.. తేలిపోయిన పవన్ బలం

YCP: కాపు నేతలకు వైసీపీ ఫోన్లు.. తేలిపోయిన పవన్ బలం

YCP: ఏపీలో( Andhra Pradesh)తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నేతలు ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కాపు నేతలు తెగ భయపడుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ను వారు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను ఎంతలా తిడితే.. తమ రాజకీయ భవిష్యత్తు అంతలా ఇబ్బందుల్లోకి వెళ్తుందని వారు ఆందోళనగా ఉన్నారు. ముద్రగడ పద్మనాభం కాపు ఐకానిక్ లీడర్ గా చిత్రీకరించారు. ఆయన సైతం కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తీసుకెళ్లారు. కానీ ఎందుకో కాపుల విశ్వాసాన్ని పొందలేకపోయారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కాపుల ప్రస్తావన ఎన్నడూ తీసుకురాలేదు. తాను అందరి వాడినని చెప్పుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ పవన్ రాజకీయంగా ఎదగడం ద్వారా.. తమ ఆకాంక్షను తీర్చారన్న అభిప్రాయం కాపుల్లో ఉంది. అందుకే ఆయన విషయంలో ప్రత్యేకంగా అభిమానం చూపుతున్నారు.

* ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్..
కాపు సామాజిక వర్గం వారికి రాజకీయ స్థిరత్వం ఉండదు. అలాగని రాజ్యాధికారం దొరకదు. కాపుల కంటే తక్కువ శాతం ఉండే రెడ్డి సామాజిక వర్గం వారు రాజ్యమేలారు. కమ్మ సామాజిక వర్గం వారు పదవులు అనుభవించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి పదవి అనేది కాపులకు చేజిక్కకపోవడం ఆ సామాజిక వర్గంలో ఒక లోటు. గతంలో వంగవీటి మోహన్ రంగా నేతగా ఎదుగుతున్న క్రమంలో హత్యకు గురయ్యారు. ప్రజారాజ్యం పార్టీ రూపంలో ఒక అవకాశం వచ్చింది. కానీ అదే ప్రజారాజ్యం పార్టీ చుట్టూ రాజకీయాలు ప్రభావం చూపాయి. దీంతో చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఇటువంటి క్రమంలో రాజకీయాలకు పావుగా మారింది కాపు సామాజిక వర్గం. అందుకే ఆ సామాజిక వర్గాన్ని ఎన్నికల్లో తమ వైపు తిప్పుకొని పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. కానీ కాపుల ఆకాంక్ష మాత్రం తీరలేదు.

* విశ్వసించిన కాపులు..
2024లో కాపులు పవన్ కళ్యాణ్ ను బలంగా నమ్మారు. ఆయన సూచించిన కూటమి పార్టీలకు ఓటు వేశారు. కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారారు. నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. కేవలం ఎక్కడ పవన్ కళ్యాణ్ కాపు అనే పదం ఎక్కువగా వాడడం లేదు. అయినా సరే విశ్వసించారు అంటే దాని వెనుక ఉన్న కారణం తమ సామాజిక వర్గం నేత ఈ స్థాయికి రావడం. ముఖ్యమంత్రి కాలేదన్న బాధ డిప్యూటీ సీఎంతో తీర్చారు పవన్ కళ్యాణ్. అందుకే పవన్ కళ్యాణ్ వెంట నడిచేందుకు మెజారిటీ కాపు ప్రజలు ఎన్నడూ సిద్ధంగా ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ను వ్యతిరేకించే ఇతర పార్టీల్లో ఉన్న కాపు సామాజిక వర్గం నేతలకు ఇబ్బందికరమే. మొన్ననే అంబటి రాంబాబు అరెస్టు విషయంలో కాపు నేతలకు వైసీపీ నుంచి ఫోన్లు వచ్చాయి. వందలాదిమందికి గాను స్పందించింది కొద్దిమంది మాత్రమే. తద్వారా కాపుల్లో ఫేమ్ పవన్ కళ్యాణ్ కు తగ్గలేదని తేలిపోయింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper