Homeఆంధ్రప్రదేశ్‌YSR Death Anniversary : విజయమ్మ ఔట్.. షర్మిల ఔట్.. ఇప్పుడు వైఎస్ఆర్ ను కూడా...

YSR Death Anniversary : విజయమ్మ ఔట్.. షర్మిల ఔట్.. ఇప్పుడు వైఎస్ఆర్ ను కూడా పక్కనపెట్టేశారా?

YSR Death Anniversary : వైసీపీ ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు.. అంతకుముందు ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టినప్పుడు.. ఇలా అనేక సందర్భాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రజల మదిలో మహానేతగా చిత్రీకరించేవారు. వైయస్ జయంతిని.. వర్ధంతిని అదేదో పండగలాగా జరిపేవారు. వైఎస్ వల్లే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వ్యవసాయం చేస్తున్నారని.. అన్నం తింటున్నారని.. ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారని.. విమానాలు ఎక్కుతున్నారని.. ఇలా రకరకాలుగా సాక్షి ప్రచారం చేసేది. […]

YSR Death Anniversary : వైసీపీ ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు.. అంతకుముందు ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టినప్పుడు.. ఇలా అనేక సందర్భాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రజల మదిలో మహానేతగా చిత్రీకరించేవారు. వైయస్ జయంతిని.. వర్ధంతిని అదేదో పండగలాగా జరిపేవారు.

వైఎస్ వల్లే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వ్యవసాయం చేస్తున్నారని.. అన్నం తింటున్నారని.. ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారని.. విమానాలు ఎక్కుతున్నారని.. ఇలా రకరకాలుగా సాక్షి ప్రచారం చేసేది. జగన్ కూడా మైక్ అందుకుంటే చాలు రాజశేఖర్ రెడ్డి మహానుభావుడు.. మార్తాండ తేజుడు అనే లెవెల్ లో స్పీచ్ లు దంచేవాడు. అంతేకాదు.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏపీ ప్రభుత్వంలో అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకానికి వైఎస్ పేరు పెట్టారు. వైయస్ ఒక మహా ఋషి అని.. వైయస్ ఏపీ రాష్ట్రంలో ఒక ధ్రువతార అని ప్రచారం చేసేవారు.

వైయస్ జయంతి కార్యక్రమాలను.. వైయస్ వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేవారు. సాక్షిలో పేజీలకు పేజీలు యాడ్స్ కుమ్మేసేవారు. కానీ ఇప్పుడు.. అధికారం లేదు.. ఏపీలో ప్రతిపక్ష స్థానం లేదు. కనీసం సోదరి షర్మిల తో మెరుగైన సంబంధం లేదు. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు లేరు. ఆపత్కాలంలో వెంట నడిచిన వారు లేరు. మొత్తంగా జగన్ ఏకాకి. ఇలాంటి సందర్భంలో తండ్రి వర్ధంతి గురించి సొంత మీడియాలో కొంచెం కూడా రాయించలేకపోయాడు. సాక్షి పత్రికలో భూమన కరుణాకర్ రెడ్డి.. ఉండవల్లి అరుణ్ కుమార్ మినహా వైఎస్ ప్రస్తావన లేదు.

నిజంగానే సాక్షి వైఎస్ ను మర్చిపోయిందా.. అప్పట్లో సాక్షి ఛానల్ లోగోలో వైయస్ ఫోటో కనిపించేది. 2024 ఎన్నికలకు ముందు సాక్షి లోగోలో వైఎస్ పేరు తొలగించారు. సాక్షి మాస్టర్ హెడ్ పక్కన మాత్రమే రాజశేఖర్ రెడ్డి ఫోటోను కొనసాగిస్తున్నారు. ఇక అప్పట్లో వైసీపీ అధికారిక లోగోలో కూడా వైఎస్ ఫోటో కనిపించేది. ఆయన ఫోటోను కూడా సైజు తగ్గించారు. జగన్ ఫోటో పరిమాణాన్ని పెంచారు. ఇంకా చెప్పాలంటే వైయస్ ఉనికిని జగనే తగ్గిస్తున్నట్టు టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. చివరికి వైయస్ వర్ధంతిని కూడా సాక్షి పేపర్లో ప్రచురించలేదు. సాక్షి ఛానల్ లో ప్రస్తావించలేదు. దీనినిబట్టి వైయస్ జగన్ తనకు అనుకూలంగా ఉన్న సమయంలో ఎలా వాడుకున్నారు.. ఇప్పుడు ఎలా పక్కన పెడుతున్నారు.. అనే విషయాన్ని గుర్తించాలని టిడిపి నేతలు అంటున్నారు. ఆస్తుల విషయంలో కన్నతల్లికి నోటీసులు ఇచ్చినవాడు.. చనిపోయిన తండ్రిని ఎలా గుర్తుంచుకుంటాడని టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. మరి దీనికి వైసిపి నాయకులు ఏ విధంగా సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది. అన్నట్టు ఈ కథనం రాసే సమయం నాటికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వైయస్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఆమెకు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ తన తండ్రిని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అయినా తండ్రి విషయంలో బిడ్డ ప్రేమ.. కొడుకు ప్రేమ ఒకే విధంగా ఉండదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper