Nara Lokesh: వ్యక్తి బలంగా ఉంటే వ్యవస్థ అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది.. అలాంటి వ్యవస్థను నిర్మించిన వ్యక్తి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాడు. అంతేకాదు తనలాంటి వ్యక్తులకు మరింత బలాన్ని ఇచ్చి అత్యంత బలోపేతమైన వ్యవస్థను నిర్మిస్తాడు. సరిగ్గా ఇలాంటి సూత్రాన్ని నమ్మారు కాబట్టే చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయస్థాయిలో అద్భుతమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తన దూర దృష్టితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐటి గుమ్మంగా మార్చిన ఆయన.. ఇప్పుడు తన వారసుడు నారా లోకేష్ ద్వారా ఏపీ రాష్ట్రానికి సరికొత్త దశను, అద్భుతమైన దిశను చూపిస్తున్నారు.
ఏపీలో ఐటీ మంత్రిగా పనిచేస్తున్న నారా లోకేష్.. ఏపీ రాష్ట్రానికి ఐటి కంపెనీలను తీసుకురావడంలో.. వేలకోట్ల పెట్టుబడులు పెట్టించడంలో విజయవంతమవుతున్నారు. ఇటీవల విశాఖపట్నం నగరంలో గూగుల్ తన డాటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. మరి కొద్ది రోజుల్లో డాటా సెంటర్ నిర్మాణం కూడా పూర్తి కాబోతోంది. ఇది పూర్తయితే విశాఖపట్నం నగరం రూపురేఖలే కాదు.. ఏపీ ముఖ చిత్రమే పూర్తిగా మారిపోతుంది. గూగుల్ డాటా సెంటర్ ద్వారా సరికొత్త ఎకో సిస్టం డెవలప్ అయి.. మరిన్ని ఐటి కంపెనీలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇండస్ట్రీలను డెవలప్ చేయడానికి.. వినూత్నమైన ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేవలం పరిశ్రమల కోసమే 50,000 ఎకరాల ల్యాండ్ బ్యాంకును సిద్ధం చేసింది.. ఇదే విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు సగర్వంగా ప్రకటించారు.
విశాఖపట్నం నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చడానికి కంకణం కట్టుకున్న నారా లోకేష్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే గూగుల్ సీఈఓ ద్వారా ప్రశంసలు అందుకున్న ఆయన.. తాజాగా విశాఖపట్నంలో జరుగుతున్న CII సమ్మిట్ ను పెట్టుబడులకు స్వర్గధామం లాగా నిర్మించుకుంటున్నారు. అంతేకాదు దిగ్గజ కంపెనీల అధిపతులను విశాఖపట్నం నగరానికి ఆహ్వానించి.. భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ప్రభుత్వంతో పెద్ద పెద్ద కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకోవడంలో నారా లోకేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. త్వరిత, ప్రభావంతమైన వ్యాపార అభివృద్ధిని సాధించడానికి నారా లోకేష్ దక్షతను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్ద పెద్ద కంపెనీల ఆధిపతులను నారా లోకేష్ కన్విన్స్ చేయగలుగుతున్నారు. నారా లోకేష్ పనితీరును కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఇతర మంత్రులు ప్రశంసిస్తున్నారు.. అదాని గ్రూప్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది. అంతేకాదు మరింత స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. అదాని గ్రూపును ఒప్పించడంలో నారా లోకేష్ తీవ్రంగా కృషి చేశారు. SYRMA SGS మేనేజింగ్ డైరెక్టర్ జస్బీర్ గుజ్రాల్ నారా లోకేష్ పనితీరును అభినందించారు.. తమ కంపెనీ పెట్టే పెట్టుబడులకు సంబంధించి కేవలం 14 రోజుల్లోనే ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయని.. దీనంతటికీ నారా లోకేష్ కారణమని గుజ్రాల్ అభిప్రాయపడ్డారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సమ్మిట్ నిర్వహణ పట్ల హర్షం వ్యక్తం చేశారు.. ఇది బలమైన భాగస్వామ్యాలకు.. ఏపీ ఆర్థిక ముఖ చిత్రం పారిపోవడానికి సహకరిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.. ఏపీ రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు.. వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.. అయితే ఈ సదస్సుకు అతిరథ మహారథులు.. పెద్దపెద్ద కంపెనీల ప్రతినిధులు హాజరు కావడంతో విశాఖపట్నం నగరం అంతర్జాతీయంగా ఖ్యాతిని ఆర్జిస్తోంది.