Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: లోకేష్ ను ఆపండి.. జగన్ కు హెచ్చరికలు!

Nara Lokesh: లోకేష్ ను ఆపండి.. జగన్ కు హెచ్చరికలు!

Nara Lokesh: నారా లోకేష్ చాలా దూకుడుగా ఉన్నారు. ఆయన దూకుడు చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో ఒకరకమైన ఆందోళన కనిపిస్తోంది. ఆయన వ్యవహరిస్తున్న తీరు.. పార్టీలో పెంచుకున్న పట్టు.. ప్రభుత్వంలో కీలక పాత్ర.. కేంద్ర పెద్దలతో సఖ్యత.. పెట్టుబడులను తీసుకురావడంలో చూపుతున్న చొరవ చూసి ఆశ్చర్యపోతున్నారు. పైగా చంద్రబాబులా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు లోకేష్ దగ్గర. ఒక పద్ధతి ప్రకారం లోకేష్ ముందుకెళ్తున్న తీరు వారిలో ఒక రకమైన ఆలోచన తెచ్చినట్లు తెలుస్తోంది. […]

Nara Lokesh: నారా లోకేష్ చాలా దూకుడుగా ఉన్నారు. ఆయన దూకుడు చూసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో ఒకరకమైన ఆందోళన కనిపిస్తోంది. ఆయన వ్యవహరిస్తున్న తీరు.. పార్టీలో పెంచుకున్న పట్టు.. ప్రభుత్వంలో కీలక పాత్ర.. కేంద్ర పెద్దలతో సఖ్యత.. పెట్టుబడులను తీసుకురావడంలో చూపుతున్న చొరవ చూసి ఆశ్చర్యపోతున్నారు. పైగా చంద్రబాబులా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు లోకేష్ దగ్గర. ఒక పద్ధతి ప్రకారం లోకేష్ ముందుకెళ్తున్న తీరు వారిలో ఒక రకమైన ఆలోచన తెచ్చినట్లు తెలుస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పుడు గాని లోకేష్ ను నియంత్రించకపోతే.. భవిష్యత్తులో ఆయనను ఆపలేమని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అందుకే చంద్రబాబు కంటే లోకేష్ పై ఫుల్ ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. సీనియర్లు ఇచ్చిన సలహాతో జగన్ సైతం పునరాలోచనలో పడినట్లు ప్రచారం సాగుతోంది.

* ఎన్నో అవహేళనలు..
ఒక పదేళ్ల కిందట నారా లోకేష్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఒకలా ఉండేది. ఆయనను ఒక నాయకుడిగా అంగీకరించేందుకు కూడా ఇష్టపడేవారు కాదు వైసీపీలో కార్యకర్తలు. కానీ అదే లోకేష్ 2019లో ఓడిపోయేసరికి వేస్ట్ అన్న నిర్ణయానికి వచ్చారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయితే ఐదేళ్ల అవమానాలు, అవహేళనలను ఒక గుణపాఠాలుగా మార్చుకున్నారు లోకేష్. తనను తాను తీర్చిదిద్దుకున్నారు. తనదైన శైలిలో రాజకీయ పోరాటం చేశారు. కూటమి అధికారంలోకి రావడంతో ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. టిడిపికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. మంత్రిగా మంచి మార్కులు తెచ్చుకున్నారు. పాలనాపరంగా అడ్మినిస్ట్రేటర్ అని గుర్తింపు సాధించారు. పార్టీపై పట్టు పెంచుకున్నారు. ఆపై కేంద్ర పెద్దలతో సఖ్యతగా మెలుగుతూ జాతీయస్థాయిలో సైతం తన ప్రాబల్యం పెంచుకున్నారు.

* తెర వెనుక వ్యూహం ఆయనదే..
దూకుడు కలిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఎదుర్కోవడంలో తనదైన రాజకీయాన్ని చూపించారు. కేసులతోపాటు అరెస్టు విషయంలో లోకేష్ పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యం. అది వైసీపీ సీనియర్లకు తెలుసు. కేసులతోపాటు అరెస్టుల బారిన పడుతున్న నేతలకు మరి ఎరుక. అందుకే తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు. లోకేష్ ను విడిచి పెడితే మున్ముందు ఇబ్బందికరమే అని.. ఆయనను ఆపలేమని కూడా చెబుతున్న వారు ఉన్నారు. అయితే ఆయనను నియంత్రించే క్రమంలో ఎన్నెన్నో కుట్రలకు తెరలేపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటికే అటువంటి వాటిని ఛేదించి నిలబడ్డారు లోకేష్. కచ్చితంగా వైసీపీ రాజకీయానికి మాత్రం ఆయన చిక్కరు. అంతటి స్థాయికి ఆయన వెళ్లిపోయారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper