Homeఆంధ్రప్రదేశ్‌Vijaya Sai Reddy : సజ్జల నన్ను కొట్టాడు.. జగన్ సైలెంట్ గా ఉన్నాడు.. విజయ...

Vijaya Sai Reddy : సజ్జల నన్ను కొట్టాడు.. జగన్ సైలెంట్ గా ఉన్నాడు.. విజయ సాయి రెడ్డి సంచలనం

Vijaya Sai Reddy : సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టిన తర్వాత.. వైయస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని తనై నడిపించారు విజయసాయిరెడ్డి. జగన్ కంపెనీలలోకి ప్రవహించిన పెట్టుబడులు.. ఆయన స్థాపించిన సంస్థలు.. సంపాదించిన ఆస్తులు.. వీటన్నిటిని పర్యవేక్షించారు విజయసాయిరెడ్డి. అప్పట్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టినప్పుడు.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు దొరకకుండా జగన్ స్థాపించిన కంపెనీల వ్యవహారాలను.. లోగోట్టును బయటపడకుండా చూశారు విజయసాయిరెడ్డి. 2019 ఎన్నికల్లో జగన్ గెలవడంలో షర్మిల ఎంతైతే పాత్ర పోషించారు.. […]

Vijaya Sai Reddy : సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టిన తర్వాత.. వైయస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని తనై నడిపించారు విజయసాయిరెడ్డి. జగన్ కంపెనీలలోకి ప్రవహించిన పెట్టుబడులు.. ఆయన స్థాపించిన సంస్థలు.. సంపాదించిన ఆస్తులు.. వీటన్నిటిని పర్యవేక్షించారు విజయసాయిరెడ్డి. అప్పట్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టినప్పుడు.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు దొరకకుండా జగన్ స్థాపించిన కంపెనీల వ్యవహారాలను.. లోగోట్టును బయటపడకుండా చూశారు విజయసాయిరెడ్డి.

2019 ఎన్నికల్లో జగన్ గెలవడంలో షర్మిల ఎంతైతే పాత్ర పోషించారు.. అంతకుమించిన స్థాయి పాత్రను విజయసాయిరెడ్డి పోషించారు. నాడు రాజ్యసభ సభ్యుడిగా విజయ సాయి రెడ్డి ఉండేవారు. ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ కోటరీలో చేరిపోయారో అప్పుడే పరిస్థితి మారిపోయింది. విజయసాయి రెడ్డి ప్రభ మసకబారడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో భౌతిక దాడికి గురయ్యారు. ఆ సమయంలో జగన్ పక్కనే ఉన్నప్పటికీ కనీసం మాట కూడా మాట్లాడలేదు. దీనికి తోడు అన్ని బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డిని తప్పించారు. దీంతో తట్టుకోలేక విజయసాయిరెడ్డి బయటికి వచ్చేసారు. పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు.

పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి అసలు విషయాలను బయటపెడుతున్నారు.. మద్యం కుంభకోణం.. ఇతర అక్రమాలను ఆయన మీడియా ముందు ఉంచుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. నాడు పార్టీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను.. అవమానాలను ఆయన బయటపెట్టారు. 2022లో వైసీపీ ప్లీనరీలో అందరి ముందు విజయసాయి రెడ్డి పై సజ్జల రామకృష్ణారెడ్డి భౌతిక దాడి చేశారు. నాడు జగన్ ప్రత్యేక పాత్రకే పరిమితమయ్యారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అన్ని బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డిని జగన్ తప్పించారు. అంతేకాదు నాటి సజ్జల కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలకు మాత్రమే కాకుండా మంత్రులకు కూడా జగన్ అపాయింట్మెంట్ లభించకుండా చేశారట. అందువల్లే వైసీపీ ఓడిపోయిందట. ఇప్పుడు టిడిపి కూటమితో సజ్జల రాజీ పడ్డారట. అందువల్లే నమోదైన కేసులలో ఆయన పేరు మీద చార్జిషీట్ ఏర్పాటు చేయలేదట. అంతేకాదు సజ్జల వల్ల జగన్ తన కుటుంబానికి దూరమయ్యారట. ఒకవేళ 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటమి ఎదురైతే అది ముమ్మాటికి సజ్జల వల్లేనని విజయసాయి రెడ్డి ఆరోపించారు. మొత్తానికి విజయసాయిరెడ్డి మరోసారి వైసీపీలో ఉన్న అసలు వ్యవహారాలను బయట పెట్టడంతో.. ఇప్పుడు ఆ పార్టీ నేతలకు మాట్లాడే అవకాశం లేకుండా పోతుంది. సరిగా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీలో జరుగుతున్న వ్యవహారాలను విజయసాయిరెడ్డి బయట పెట్టడంతో.. ఆ పార్టీకి ఉక్కపోత ఎదురవుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper