Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ ప్రోగ్రాం సరిగ్గా మరో వారం రోజుల్లో స్టార్ మా ఛానల్ లో మొదలు కానుంది. ఈ షో పై ఆడియన్స్ లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవనే చెప్పాలి. గత సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే అందుకు ముఖ్య కారణం. ఇది కాసేపు పక్కన పెడితే ఈ షో లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ జాబితా ని ఇది వరకే మనం పలు మార్లు చూశాము. ఇప్పుడు వీళ్లంతా బిగ్ బాస్ హౌస్ లోకి ఎలా ఎంట్రీ ఇవ్వబోతున్నారో ఒకసారి చూద్దాం. ముందుగా ఆటో రామ్ ప్రసాద్ విషయానికి వస్తే, ఈయన ఒక డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. అంతే కాకుండా , ఆయనకు సంబంధించిన AV ని కూడా ప్లే చేస్తారట, అందుకు సంబంధించిన షూటింగ్ కూడా రీసెంట్ గానే పూర్తి చేసినట్టు సమాచారం.
ఇక ఆ తర్వాత ముకేశ్ గౌడ కూడా డ్యాన్స్ మరియు AV లతో ఎంట్రీ ఇస్తాడని సమాచారం. ఈయన తెలుగు లో ఒక సూపర్ హిట్ సీరియల్ లో హీరో గా చేసినప్పటికీ, కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాడు కావడంతో, తెలుగు భాష పెద్దగా రాదు. అందుకే ప్రత్యేకంగా తనని తానూ వ్యక్తిగతంగా ఆడియన్స్ కి పరిచయం చేసుకోవడానికి AV ని తయారు చేయించుకున్నాడట. ఇక యాంకర్ వర్షిణి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుండగా, జబర్దస్త్ పొట్టి నరేష్ , కృష్ణుడు వంటి వారు AV తో ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. అదే విధంగా ఈ షో లోకి సీరియల్ హీరోయిన్స్ దెబ్ జాన్ మెదక్, చైత్ర వంటి వారు కూడా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళు కూడా డ్యాన్స్ + AV తో ఎంట్రీ ఇస్తారట.
ఇక ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ కూడా గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ద్వారానే రానున్నారు. ఇప్పటికే సింగర్ ఝాన్సీ ఫినాలే లో ఫైనల్ టాస్కులు ఆడి ‘టికెట్ టు బిగ్ బాస్ హౌస్’ గెలుచుకుంది. ఇక మిగిలిన వారిలో రోహిత్ , అమన్ ఎంట్రీలు ఖరారు అయ్యాయి. దీపక్, మితిలేష్ రెడ్డి,చరణ్, షాలినీ, శ్రేష్టి వ్యాకరణం,రాజకుమారి దయానా, హేమంత్ , రామకృష్ణ వంటి కంటెస్టెంట్స్ లో ఎవరెవరు ఈ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా తెలియాలంటే వచ్చే ఆదివారం వరకు ఆగాల్సిందే.