Homeఆంధ్రప్రదేశ్‌RK New Kotha Paluku: కెసిఆర్, రాజశేఖర్ రెడ్డి కుటుంబాలేనా.. మీ ఫ్యామిలీ సంగతేంటి ఆర్కే...

RK New Kotha Paluku: కెసిఆర్, రాజశేఖర్ రెడ్డి కుటుంబాలేనా.. మీ ఫ్యామిలీ సంగతేంటి ఆర్కే సార్..

RK New Kotha Paluku: అనుకున్నట్టుగానే.. అంచనా వేసినట్టుగానే.. ఊహించినట్టుగానే ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ కేసీఆర్ కుటుంబం మీద.. రాజశేఖర్ రెడ్డి కుటుంబం మీద రాసుకు వచ్చారు. వాటాలలో మోసాలు జరిగాయని.. అందువల్లే వారసుల మధ్య జగడాలు చోటుచేసుకుంటున్నాయని తాటికాయ పరిమాణంలో… రాధాకృష్ణ తన సొంత పత్రిక ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు శీర్షిక మీద సంపాదకీయం రాశారు. కెసిఆర్ పిల్లల మధ్య.. రాజశేఖర్ రెడ్డి పిల్లల మధ్య వివాదాలు ఏర్పడేందుకు ప్రధాన కారణం అక్రమ సంపాదనట. […]

RK New Kotha Paluku: అనుకున్నట్టుగానే.. అంచనా వేసినట్టుగానే.. ఊహించినట్టుగానే ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ కేసీఆర్ కుటుంబం మీద.. రాజశేఖర్ రెడ్డి కుటుంబం మీద రాసుకు వచ్చారు. వాటాలలో మోసాలు జరిగాయని.. అందువల్లే వారసుల మధ్య జగడాలు చోటుచేసుకుంటున్నాయని తాటికాయ పరిమాణంలో… రాధాకృష్ణ తన సొంత పత్రిక ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు శీర్షిక మీద సంపాదకీయం రాశారు.

కెసిఆర్ పిల్లల మధ్య.. రాజశేఖర్ రెడ్డి పిల్లల మధ్య వివాదాలు ఏర్పడేందుకు ప్రధాన కారణం అక్రమ సంపాదనట. ఇందులో నిజం ఉండొచ్చు. ఎందుకంటే కెసిఆర్ కుటుంబానికి రాధాకృష్ణ దగ్గర. ఇప్పుడు రాధాకృష్ణకు కవిత దగ్గర. కాబట్టి లోగుట్టు పెరుమాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అందువల్లే రాధాకృష్ణ ఈ విషయాలను బయటపెట్టారేమో. నిజానికి రాజకీయ నాయకులు ఎవరు కూడా శుద్ధ పూసలు కాదు. కాకపోతే ముఖ్యమంత్రి పదవులలో ఉన్న వారికి ఆయాచితంగా డబ్బులు వచ్చి పడుతూ ఉంటాయి. ముఖ్యమంత్రి కాకముందుకు రాజశేఖర్ రెడ్డి.. కెసిఆర్ ఆర్థిక స్థితి అందరికి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత వారు ఎలా మారిపోయారు.. ఏ స్థాయిలో సంపాదించుకున్నారో కూడా అందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి భారీగా సహాయాలు చేసేవారు. కాకపోతే ఈ విషయాలు బయటకి వచ్చేవి కావు. అప్పట్లో మీడియా విస్తృతి ఇంతగా ఉండేది కాదు. పైగా తెలంగాణకు ఇన్చార్జిలు గా ఉండే కాంగ్రెస్ నాయకులకు రాజశేఖర్ రెడ్డి గట్టి మేలు చేసేవారని వినికిడి. ఇక కెసిఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాదగిరిగుట్టలో నరసింహ స్వామికి బంగారం.. ఇంకా చాలా ఖరీదైన కానుకలు ఇచ్చారు. ఇక యాగాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా చాలా ఖరీదైనవిగా సాగుతూ ఉండేది.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెసిఆర్ కుటుంబంలో లుకలుకలు బయటపడలేదు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నంతవరకు కుటుంబంలో ఉన్న ఏ ఒక్క విషయం కూడా సభ్య సమాజం దృష్టికి రాలేదు. రాజశేఖర్ రెడ్డి గతించిన తర్వాత.. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. పరిస్థితులు మారిపోయాయి. అన్న కోసం త్యాగం చేసిన షర్మిలకు చివరికి సొంత బిడ్డ పెళ్లి చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇక కెసిఆర్ కు అత్యంత ఇష్టమైన కవిత.. తండ్రికి దూరం కావలసి వచ్చింది. దీని వెనక ఉన్నది ఎవరు.. దీని ముందున్నది ఎవరు.. కథ నడిపిస్తున్నది ఎవరు అందరికీ తెలుసు.

కాకపోతే పోగుపడిన ఆస్తులలో వాటాల పంచాయతీ వల్లే ఈ గొడవ జరిగిందని.. కేటీఆర్ కు కవిత.. జగన్ కు షర్మిల దూరమయ్యారని రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. అయితే శకునం చెప్పే బల్లి కుడిదిలో పడ్డట్టు.. కెసిఆర్ కుటుంబం గురించి.. రాజశేఖర్ రెడ్డి కుటుంబం గురించి చెప్పుకొచ్చిన రాధాకృష్ణ.. తన ఇంటి గురించి చెప్పడం మర్చిపోయారు.. మొన్నటిదాకా తన కంపెనీలలో డైరెక్టర్ గా ఉన్న అల్లుడిని ఎందుకు తొలగించారు.. ఆయన స్థానంలో కోడలు శృతి కీర్తిని ఎందుకు పెట్టారు.. గతంలో ఎండిగా ఉన్న ఆయన కొడుకుని ఎందుకు ఆస్థానంలోకి తీసుకొచ్చారు.. తన తర్వాత అన్ని విషయాలు కొడుక్కి మాత్రమే చెప్పాలని ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్ ద్వారా ఎందుకు ఆదేశాలు జారీ చేశారు.. ఈ విషయాలకు రాధాకృష్ణ సమాధానం చెప్పక పోయినంతమాత్రాన.. తెలియని అమాయకులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కాదు.. కాకపోతే ఆయన పత్రిక కాబట్టి.. ఆయన విషయాలను బయట పెట్టుకోలేదు. ఆయన చెప్పనంతమాత్రాన బయటపడకుండా ఉంటుందా.. ఆయనకంటూ సొంత పత్రిక ఉన్నట్టు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సోషల్ మీడియా అనేది ఒకటి ఉంటుంది. అందులో దాచేస్తే తాగదు.. ఆపేస్తే ఆగదు.. ఈ చిన్న లాజిక్ రాధాకృష్ణ ఎలా మర్చిపోయారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper