Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh Local Body Elections: ఏపీ స్థానిక ఎన్నికలు.. ఓటెత్తుతున్న జనం

Andhra Pradesh Local Body Elections: ఏపీ స్థానిక ఎన్నికలు.. ఓటెత్తుతున్న జనం

Andhra Pradesh Local Body Elections: ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్ల పోలింగ్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఓటరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. స్వేచ్ఛగా ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి అధికారులు ఏర్పాటు చేశారు. గడచిన కొద్దిరోజులుగా అధికారులు విస్తృతంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటున్నారు. భారతశకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు అడుగులు వేశారు. ఏపీ రాష్ట్రంలో మొత్తం 100 పట్టణ స్థానిక […]

Andhra Pradesh Local Body Elections: ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్ల పోలింగ్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఓటరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. స్వేచ్ఛగా ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి అధికారులు ఏర్పాటు చేశారు. గడచిన కొద్దిరోజులుగా అధికారులు విస్తృతంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు నిరంతరం సమన్వయం చేసుకుంటున్నారు. భారతశకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు అడుగులు వేశారు.

ఏపీ రాష్ట్రంలో మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలలో ఎన్నికల జరుగుతున్నాయి. యునానిమస్ స్థానాలు కాకుండా.. 13 నగర పాలకాలు.. 79 పురపాలకాలు.. నగర పంచాయతీలు.. 92 పురపాలక సంఘాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 3942 వార్డులు ఉండగా.. ఇందులో 756 వార్డులు యునానిమస్ అయ్యాయి. కార్పొరేషన్ల పరిధిలో 118 మంది.. పురపాలకాల పరిధిలో 638 మంది వార్డు సభ్యులు.. 17 మంది చైర్ పర్సన్లు యునానిమస్ గా ఎన్నికయ్యారు. ఇక మిగిలిన ప్రాంతాలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలో 1,449 మంది రిటర్నింగ్ అధికారులు.. 13,504 మంది ప్రిసైడింగ్ అధికారులు.. ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

ఎన్నికల నేపథ్యంలో సెక్యూరిటీ.. లా అండ్ ఆర్డర్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 36,351 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. పోలింగ్ కేంద్రాలను మొత్తంగా మూడు భాగాలుగా విభజించారు. సాధారణం.. సున్నితం.. అత్యంత సున్నిత ప్రాంతాలుగా డిబేట్ చేశారు. అక్కడ సెక్యూరిటీ కల్పించారు. బ్యాలెట్ బాక్స్ ల రవాణా.. స్ట్రాంగ్ రూములలో పర్యవేక్షణ కోసం ఏకంగా 1543 రూట్ మొబైల్స్ ఏర్పాటు చేశారు. ఒకవేళ అనివార్యమైన పరిస్థితులు ఏమైనా ఎదురైతే సమర్థవంతంగా ఎదుర్కోవడానికి డిఎస్పి.. అదనపు డిఎస్పి ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు.. క్విక్ రియాక్షన్ బృందాలను రంగంలోకి దించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ లను కూడా సిద్ధంగా ఉంచారు.

పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడానికి 600 ప్రాంతాలలో సుమారు 12వేల సిసి టీవీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరపాలక పరిధిలో 153 మంది మేయర్ అభ్యర్థులు.. పురపాలక పరిధిలో 367 మంది అభ్యర్థులు రంగంలోకి నిలిచారు. మొత్తంగా 9,642 మంది వార్డు సభ్యులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సెన్సిటివ్ ఏరియాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి ఓటింగ్ సరళిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎంపీటీసీ.. జెడ్పిటిసి ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper