spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Visakha :  ఆ సీటు ఎప్పుడు టీడీపీకి చేటే

Visakha :  ఆ సీటు ఎప్పుడు టీడీపీకి చేటే

Visakha :  టీడీపీ ఉత్తరాంధ్రకు కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి మంచి విజయాలే సొంతం చేసుకుంది. 2019 ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితమైనా.. ఉత్తరాంధ్రలో మాత్రం అరడజను సీట్లు సాధించింది. జగన్ ప్రభంజనాన్నిసైతం తట్టుకోని ఆరుగురు టీడీపీ తరుపున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. టీడీపీ ఆవిర్భావం తరువాత గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి ఎప్పుడూ ఎదురుకాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాంతో సమానంగా సీట్లు సాధించేది టీడీపీ. మంచి ట్రాక్ రికార్డే ఉంది. కానీ విశాఖ పార్లమెంట్ స్థానం విషయంలో మాత్రం టీడీపీకి అసంతృప్తే. టీడీపీ ఆవిర్భావం తరువాత జరిగిన పది ఎన్నికల్లో.. కేవలం మూడు సార్లు మాత్రం పసుపు జెండా ఎగిరింది. విశాఖ లోక్ సభ స్థానాన్ని టీడీపీ గెలిచి పాతికేళ్లవుతోంది.

1983లో టీడీపీ ఆవిర్భవించింది. 1994 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో కంటెస్ట్ చేసింది. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన రాజకీయ కురు వృద్ధుడు భాట్టం శ్రీరామమూర్తిని ఎంపీ అభ్యర్థిగా బరిలో దించడంతో ఆయన ఘన విజయం సాధించారు. అటు తరువాత ఎంవీవీఎస్ మూర్తి రూపంలో మరో రెండు సార్లు ఎంపీ సీటు దక్కింది. టోటల్ గా చూస్తే ఇప్పటికి పది సార్లు పార్లమెంట్ కి ఎన్నికలు జరిగితే తెలుగుదేశం మూడంటే మూడేసార్లు గెలవడం విశేషం. టీడీపీ పుట్టాక విశాఖ ఎంపీ సీటులో కాంగ్రెస్ అయిదు సార్లు గెలిస్తే బీజేపీ ఒకసారి. వైసీపీ ఒకసారి గెలిచాయి.

సాగర నగరంలో ఉత్తరాధి రాష్ట్రాల ప్రభావం ఎక్కువ.  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా ఉండడమే అందుకు కారణం. అర్బన్ ఓటర్లు అధికంగా ఉంటారు. వారు జాతీయ పార్టీలకు మొగ్గుచూపుతారు. విశాఖ ఎంపీ సీటు అనేసరికి కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డు ఉంది. అత్యధిక సారు ఆ పార్టీయే ఎంపీ సీటుని గెలుచుకుంది. 1999లో చివరిసారిగా టీడీపీ ఇక్కడ నుంచి గెలిచింది. ఎంవీవీఎస్ మూర్తి రెండవసారి అప్పట్లో విజయం సాధించారు. అయితే వలస నాయకులను గెలిపించడం, అది కాంగ్రెస్ పార్టీయే కావడం గమనార్హం. టి.సుబ్బరామిరెడ్డి రెండు సార్లు గెలిస్తే, మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధనరెడ్డి ఒకసారి, దగ్గుబాటి పురంధేశ్వరి ఒకసారి గెలిచారు 2014లో టీడీపీ మద్దతుతో బీజేపీ గెలిచింది.  హరిబాబు ఎంపీగా గెలిచారు. 2019లో టీడీపీని ఓడించి నాలుగు వేల ఓట్ల తేడాతో వైసీపీ గెలిచింది.

25 సంవత్సరాలు విశాఖ లోక్ సభ స్థానాన్ని గెలవని టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో కైవసం చేసుకుంటుందా? అంటే దానికి సమాధానం లేదు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. టీడీపీ, జనసేన, కలిసి వస్తే బీజేపీని కలుపుకెళతామని చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు. అదే జరిగితే పొత్తుల్లో భాగంగా బీజేపీ కోరే తొలి ఎంపీ స్థానం విశాఖ అవుతుంది. 2014 రికార్డును చూపి ఈ సీటును కోరే అవకాశముంది. అటు జనసేన సైతం గత ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధించింది. సో మరోసారి పొత్తుల్లో భాగంగా విశాఖ లోక్ సభ స్థానం దూరమైతే మూడు దశాబ్దాల పాటు టీడీపీ వదులుకున్నట్టవుతుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

US Tariffs

US Tariffs: అమెరికా భారీ బిగ్ బాంబ్.. 60 దేశాలకు షాక్.. భారత్ పై ఎఫెక్ట్ ఎంతంటే?

US Tariffs: అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం మరో టారిఫ్‌ ప్రకటించింది. వెట్టిచాకిరీ ఉత్పత్తుల దిగుమతులపై కఠిన వైఖరి అవలంబిస్తూ దాదాపు 60 దేశాల నుంచి వచ్చే వస్తువులపై అదనపు సుంకాలు ప్రకటించింది. వాణిజ్య...
Chennai Love Story Twitter Talk

Chennai Love Story Twitter Talk: ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్విటర్ టాక్ ఇదే..ఇలాంటి రెస్పాన్స్ అసలు ఊహించలేదు..

Chennai Love Story Twitter Talk: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ...
Allu Arjun Lokesh Kanagaraj Movie

Allu Arjun Lokesh Kanagaraj Movie: అల్లు అర్జున్ కి కండిషన్స్ పెడుతున్న లోకేష్ కనకరాజ్…

Allu Arjun Lokesh Kanagaraj Movie: గంగోత్రి సినిమాతో కెరియర్ ను మొదలుపెట్టిన అల్లు అర్జున్... ఆ తర్వాత చేసిన సినిమాతో స్టైలిష్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అనే...
Chennai Love Story Movie Review

Chennai Love Story Movie Review: చెన్నై లవ్ స్టోరీ ఫుల్ మూవీ రివ్యూ… బొమ్మ హిట్టా? ఫట్టా?

Chennai Love Story Movie Review: 'క' సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత కే ర్యాంప్ సినిమాతో సైతం ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మరోసారి 'చెన్నై...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Oktelugu Epaper