Homeఆంధ్రప్రదేశ్‌AP Politics: ఏపీలో కండోమ్ రాజకీయాలు!

AP Politics: ఏపీలో కండోమ్ రాజకీయాలు!

తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకు సాయం అందిస్తామని టిడిపి చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటా కండోమ్ ప్యాకెట్లను టిడిపి నేతలు పంచుతున్నట్లు వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది.

AP Politics: ఏపీలో రాజకీయాలు ఫీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ.. పార్టీలు రకరకాల రూపంలో ప్రచారాలు చేసుకుంటున్నాయి.ఈ క్రమంలో సోషల్ మీడియా విభాగాల ప్రచారం అధమ స్థాయికి చేరుకుంటుంది. ఏపీ సీఎం జగన్ సిద్ధం పేరిట రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మా నమ్మకం నువ్వే జగన్ అంటూ స్టిక్కర్లు, ఫ్లెక్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో టిడిపి భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ పథకాల బుక్లెట్ లను ఇంటింటా పంపిణీ చేస్తున్న సంగతి విధితమే. అయితే ఈ రెండు పార్టీల ప్రచారంపై పరస్పరం సోషల్ మీడియాలో పెద్ద వార్ జరుగుతోంది. తెగ వైరల్ అవుతోంది.

తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకు సాయం అందిస్తామని టిడిపి చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటా కండోమ్ ప్యాకెట్లను టిడిపి నేతలు పంచుతున్నట్లు వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. పథకంలో లబ్ధిదారులను తగ్గించేందుకు ఈ కండోమ్ వాడాలని టిడిపి నేతలు ఇంటింటా పంపిణీ చేస్తున్నారని చెబుతోంది.ప్రతి ఇంట్లో ఒకరి కంటే మించి చదువుకు సాయం అందించలేని స్థితిలో టిడిపి ఉందని.. అందుకే కండోమ్ లు పంచుతోందని వైసిపి సోషల్ మీడియా విభాగం ప్రచారం చేస్తోంది.

మరోవైపు వైసీపీ ప్రచార ఆర్భాటం పతాక స్థాయికి చేరుకుందని చెబుతూ టిడిపి సోషల్ మీడియా విభాగం కండోమ్ ప్యాకెట్లపై సిద్ధం లోగోతో ప్రచారం చేస్తోంది. వైసిపి ప్రచార పిచ్చి పతాక స్థాయికి చేరుకుందని చెబుతూ జగన్ అంటున్న మాటలను జతచేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం విశేషం. అయితే ఈ రెండు పార్టీల సోషల్ మీడియా విభాగాలు పోటాపోటీగా చేస్తున్న పోస్టులు నెటిజన్లకు వినోదం పంచుతున్నాయి. అయితే ఈ తరహా రాజకీయ దుష్ప్రచారం తగదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలను మరీ ఇంత దిగజార్చడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper