Homeఆంధ్రప్రదేశ్‌Talliki Vandanam Scheme: 'తల్లికి వందనం' స్కీం లో ఊహించని ట్విస్ట్.. ఆ క్యాటగిరీ విద్యార్థులకు...

Talliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’ స్కీం లో ఊహించని ట్విస్ట్.. ఆ క్యాటగిరీ విద్యార్థులకు ఎదురుచూపులు తప్పవు..

Talliki Vandanam Scheme: లక్షలాది మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘తల్లికి వందనం’ పధకం డబ్బులను ఈ నెల 22 న విడుదల చేయబోతున్నట్టు , ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 67,47,190 మంది విద్యార్థులకు ఈ పధకం అందనుంది. ఆ విద్యార్థుల తల్లులు దాదాపుగా 42,70,902 మంది ఉన్నారు. వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో 13000 రూపాయిలు జామకానుంది. మిగిలిన రెండు వేల రూపాయిలు […]

Talliki Vandanam Scheme: లక్షలాది మంది ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘తల్లికి వందనం’ పధకం డబ్బులను ఈ నెల 22 న విడుదల చేయబోతున్నట్టు , ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 67,47,190 మంది విద్యార్థులకు ఈ పధకం అందనుంది. ఆ విద్యార్థుల తల్లులు దాదాపుగా 42,70,902 మంది ఉన్నారు. వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో 13000 రూపాయిలు జామకానుంది. మిగిలిన రెండు వేల రూపాయిలు స్కూల్ అభివృద్ధి కి ఉపయోగించనున్నారు. దాదాపుగా 10 వేల కోట్ల నిధులను మంజూరు చేయనున్నారు. ఈ డబ్బులు ఎలాంటి జాప్యం లేకుండా మీ అకౌంట్స్ లో జమ కావాలంటే , మీ బ్యాంక్ అకౌంట్ యాక్టీవ్ గా ఉండాలి , అది ఆధార్ కార్డు తో లింక్ అయ్యి ఉండాలి. ఇదంతా పక్కన పెడితే ఈ పధకానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఈ విద్య సంవత్సరం లో కొత్తగా చేరిన విద్యార్థులు, పాఠశాల మారి 9 వ తరగతి లో చేరిన విద్యాదులు , 10 వ తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో చేరిన విద్యార్థుల నమోదు ప్రక్రియ ప్రస్తుతానికి కొనసాగుతోంది. అధికారులు వీళ్ళ డేటా ని పూర్తిగా పరీక్షించిన తర్వాత ఆగస్టు 30 వ తేదీన ఆయా విద్యార్థులకు సంబంధించిన తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కొత్తగా అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు తమకు ‘తల్లికి వందనం’ డబ్బులు దక్కవేమో అనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్ర ప్రదేశ్ విద్యా శాఖ స్పష్టం చేసింది. దీంతో ఈ క్యాటగిరీ విద్యార్థులు కాస్త ఊపిరి తీసుకున్నారు. కాకపోతే ఒక నెలరోజులు ఎదురు చూడాలంతే. గత ఏడాది కంటే ఈ ఏడాది ‘తల్లికి వందనం’ నిధులు ఎక్కువగా విడుదల చేయబోతుంది కూటమి ప్రభుత్వం.

గత ఏడాది 9 వేల కోట్లు విడుదల చేయగా, ఈ ఏడాది ఏకంగా 10 వేల కోట్ల రూపాయిల నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ గా ఒక సభ ని ఏర్పాటు చేసి , ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆద్వర్యం లో నిధులు విడుదల చేయనున్నారు. ఈ సభకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనుంది. ‘తల్లికి వందనం’ పథకం పై మాజీ సీఎం జగన్, వైసీపీ కార్యకర్తలు ఏ రేంజ్ లో వెటకారం చేసేవారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మాజీ సీఎం జగన్ కుటుంబం లో కేవలం ఒక్కరికి మాత్రమే ఈ పథకం డబ్బులు అందించగా, కూటమి ప్రభుత్వం కుటుంబం లో ఎంతమంది ఉంటే అంత మందికి అందిస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper