Homeక్రీడలుPV Sindhu: పీవీ సింధు మీద వైసిపి బ్యాచ్ ట్రోలింగ్..

PV Sindhu: పీవీ సింధు మీద వైసిపి బ్యాచ్ ట్రోలింగ్..

PV Sindhu: ఒలంపిక్స్ లో మెడల్ విన్నర్.. బ్యాడ్మింటన్ ఛాంపియన్.. అనేక పతకాలు సాధించిన విజేత. పైగా మన తెలుగు బిడ్డ.. ఇంతటి ఖ్యాతి ఉన్న పీవీ సింధును వైసిపి బ్యాచ్ టార్గెట్ చేసింది.. సోషల్ మీడియాలో విషం చిమ్ముతుంది. పీవీ సింధు చాలా కష్టపడి బ్యాడ్మింటన్ స్టార్ గా ఎదిగింది. ఎటువంటి నేపథ్యం లేకపోయినప్పటికీ ఈ స్థాయి దాకా వచ్చింది. మువ్వన్నెల జెండాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. చైనా ప్లేయర్లు దూకుడు కొనసాగిస్తున్న వేళ.. […]

PV Sindhu: ఒలంపిక్స్ లో మెడల్ విన్నర్.. బ్యాడ్మింటన్ ఛాంపియన్.. అనేక పతకాలు సాధించిన విజేత. పైగా మన తెలుగు బిడ్డ.. ఇంతటి ఖ్యాతి ఉన్న పీవీ సింధును వైసిపి బ్యాచ్ టార్గెట్ చేసింది.. సోషల్ మీడియాలో విషం చిమ్ముతుంది.

పీవీ సింధు చాలా కష్టపడి బ్యాడ్మింటన్ స్టార్ గా ఎదిగింది. ఎటువంటి నేపథ్యం లేకపోయినప్పటికీ ఈ స్థాయి దాకా వచ్చింది. మువ్వన్నెల జెండాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. చైనా ప్లేయర్లు దూకుడు కొనసాగిస్తున్న వేళ.. అమెరికన్ ప్లేయర్లు అదరగొడుతున్న వేళ.. సింధు భారత గర్వాన్ని ప్రపంచ దేశాల ముందు రెపరెపలాడించింది. చివరికి ఒలంపిక్స్ లాంటి అంతర్జాతీయ పోటీలలో మెడల్స్ సాధించి భారత దేశ స్థాయిని పెంచింది.

ఈ స్థాయిలో ప్రతిభ చూపించిన క్రీడాకారిణికి ఏ ప్రభుత్వమైనా సరే గుర్తింపు ఇస్తుంది. నగదు నజరానా ప్రకటిస్తుంది. అవసరమైతే అకాడమీ ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కూడా ఇస్తుంది. ఇలాంటి విధానం మన దేశంలో కొత్త కాదు. పైగా క్రీడాకారులకు ఇటువంటి సదుపాయాలు కల్పించడం వల్ల వాళ్లు భవిష్యత్తులో మరింత గొప్పగా రాణిస్తారని.. వారిని ఆదర్శంగా తీసుకొని చాలామంది యువత క్రీడల వైపు దృష్టిస్తారని ప్రభుత్వం నమ్ముతూ ఉంటుంది.

పీవీ సింధు సాధించిన విజయాల నేపథ్యంలో జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అకాడమీ ఏర్పాటుకు స్థలం కేటాయించింది. అప్పట్లో భూమి పూజ కూడా ఏర్పాటు చేశారు. అయితే నాటి రోజుల్లో పీవీ సింధుకు కేవలం బ్యాడ్మింటన్ అకాడమీ మాత్రమే ఏర్పాటు చేయాలని ఉండేది. ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పీవీ సింధు కలిసింది. ఆయన ఏపీలో బ్యాడ్మింటన్ అకాడమీ మాత్రమే సరిపోదని.. అంతకుమించిన స్థాయిలో ఉండాలని సూచించారు. దీంతో ఆయన సూచనల మేరకు తనకు కేటాయించిన స్థలంలో బ్యాడ్మింటన్ క్రీడలకు సంబంధించిన ఇతర నిర్మాణాలు చేపట్టాలని సింధు భావించింది. ఈ నేపథ్యంలోనే పెద కదిలి ప్రాంతంలో ఆ నిర్మాణాలకు తన తండ్రి.. తల్లితో కలిసి పూజ నిర్వహించింది. దీనిని వైసీపీ బ్యాచ్ నెగిటివ్గా తీసుకుంది. ఇంకేముంది తన అనుకూల సోషల్ మీడియా గ్రూపులలో పివి సింధు మీద విష ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఇది పీవీ సింధు దృష్టికి వెళ్లడంతో.. ఆమె రెస్పాండ్ అయింది. జరిగిన ఘటన విషయంలో క్లారిటీ ఇచ్చింది. తనను అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది.

మరి ఇప్పటికైనా వైసీపీ బ్యాచ్ ఆగుతుందా.. సింధు మీద విష ప్రచారాన్ని చేయకుండా ఉంటుందా.. జరిగిన విషయం మీద క్లారిటీ ఇచ్చిన తర్వాత వైసిపికి ఇదంతా అర్థమవుతుందా.. ఇప్పుడు ఇవే ప్రశ్నలను టిడిపి నేతలు వేస్తున్నారు. ప్రతి అంశాన్ని కూడా రాజకీయం కోసం వాడుకోవడం.. వ్యక్తులను కించపరచడం వైసిపికి అలవాటుగా మారిందని టిడిపి నేతలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper