Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Gets Clean Chit : ఊపిరి పీల్చుకోండి... కేసుల నుంచి చంద్రబాబుకు విముక్తి

Chandrababu Gets Clean Chit : ఊపిరి పీల్చుకోండి… కేసుల నుంచి చంద్రబాబుకు విముక్తి

Chandrababu Gets Clean Chit: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) పై పెట్టిన కేసులన్నీ కొట్టివేతకు గురవుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో చంద్రబాబుపై చాలా రకాల కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ఆ కేసులన్నీ తప్పుడు కేసులుగా స్పష్టమవుతోంది. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు కొట్టివేతకు గురికావడం విశేషం. తాజాగా ఈ డి కూడా ఈ కేసును తేల్చేసింది. క్లీన్ చీట్ ఇచ్చింది. అయితే ఇదే కేసులో చంద్రబాబు దాదాపు 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. బెయిల్ ఇచ్చేందుకు కూడా కోర్టు అంగీకారం తెలపలేదు. చివరికి అనారోగ్య కారణాల రీత్యా అప్పట్లో మద్యంతర బెయిల్ వచ్చింది. అసలు ఆధారాలు లేని కేసులో అన్ని రోజులపాటు చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉండిపోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. కానీ ఇప్పుడు చంద్రబాబుపై పెట్టినవన్నీ తప్పుడు కేసులుగా తేలిపోతున్నాయి. వాటికి ఆధారాలు లేకపోవడంతో క్లోజ్ అవుతున్నాయి. అయితే అప్పట్లో అవినీతి కేసులంటూ చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేశారు. అలా అరెస్టు చేసిన వారిని, చేయించిన వారిని ఏం చేయాలి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

అర్ధరాత్రి అరెస్టు..
2023 సెప్టెంబర్ లో కర్నూలు జిల్లా( Kurnool district) పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. ఆ సమయంలో అవినీతి కేసులంటూ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసును తెరపైకి తెచ్చారు. అర్ధరాత్రి చంద్రబాబును అరెస్టు చేశారు. రోడ్డు మార్గంలో గుంటూరు తీసుకొచ్చారు. ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఆధారాలు లేని కేసు కావడంతో వెంటనే బెయిల్ వస్తుందని అంతా భావించారు. కానీ కోర్టు చంద్రబాబును రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబును తరలించారు. అసలు ఆధారాలు లేని కేసులు నమోదు చేయడం, ఆపై ప్రతిపక్ష నేత కావడం, ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా వ్యవహరించడం వంటి కారణాలతో గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఆ పని చేయకపోవడంతో తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ అప్పట్లో కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే అటు తర్వాత ఆ కేసుల్లో ఎటువంటి పురోగతి లేదు. ఇప్పుడు ఒక్కొక్క కేసును ఏసీబీ విత్ డ్రా చేసుకుంటుంది. న్యాయస్థానాలు సైతం అందులో ఆధారాలు లేవని తేల్చుతున్నాయి. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఈడి చంద్రబాబుకు క్లీన్ చీట్ ఇచ్చింది.

ఆధారాలు లేని కేసులో..
కనీసం ఆధారాలు లేని కేసులో చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేయడం ఒక సంచలనమే. రోజుల తరబడి జైల్లో ఉంచడం అప్పట్లో జాతీయస్థాయిలో ఒక బలమైన చర్చ నడిచింది. రాజకీయంగా దెబ్బతీయడం కోసమే అలా చేశారని స్పష్టం అవుతోంది. అంతటితో ఆగకుండా దేశమంతా ప్రెస్ మీట్ లు పెట్టి అధికారం అండతో చట్టాన్ని అస్త్రంగా మలుచుకుని ప్రత్యర్థులను వేధించిన తీరు స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు కేసులు సిఐడి చేసిన వాదనలు న్యాయస్థానంలో నిలబడలేదు. చివరకు ఈడి కూడా ఆయన ప్రమేయం లేదని స్పష్టం చేసింది. కేవలం రాజకీయ ప్రమేయంతోనే ఈ కేసుల రూపకల్పన జరిగిందని తేలిపోయింది.

ప్రతీకార రాజకీయంతోనే
ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేని విధంగా ఈ వాతావరణం సాగింది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేశారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). ఈ ఆరోపణలతోనే 11 సిబిఐ కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో 16 నెలలపాటు జగన్మోహన్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అటు తరువాత బయటకు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు. అయితే తన జైలు జీవితానికి చంద్రబాబు ఒక కారణమన్న అనుమానం జగన్ లో ఉంది. దానికి ప్రతీకారమే చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు అనేది బహిరంగ రహస్యం. అయితే కనీసం ఆధారాలు లేని కేసులను చంద్రబాబుపై మోపి 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. కానీ ఆ కేసులను నిలబెట్ట లేకపోయారు. రాజకీయ ప్రతీకారం తో పెట్టిన కేసులని ఇప్పుడు న్యాయస్థానాలు తేల్చేస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular