Jagan Mohan Reddy: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. ఈనెల 17 నుంచి పూర్తిస్థాయిలో విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి క్రెడిట్ తమదంటే తమదే అని టిడిపి కూటమి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య గట్టి వార్ నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో గురించి అయితే చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్పేలా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో సామాన్యులు మాత్రం తమ క్రెడిట్ ను ఆ పార్టీకే ఇస్తున్నారు. ముఖ్యంగా కూటమికి జై కొడుతున్నారు. అంతటితో ఆగకుండా వైసిపి చర్యలను, జగన్మోహన్ రెడ్డి వైఖరిని తప్పుపడుతున్నారు.
* ఒకరకమైన సంతృప్తి..
ఉత్తరాంధ్ర ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల ఒక రకమైన సంతృప్తి కనిపిస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం తర్వాత ప్రజల్లో సానుకూలత ఉంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వరకు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా తమ క్రెడిట్ అని చెప్పుకొస్తున్నారు. అయితే దీనిపై రాజకీయంగా టిడిపి తో పాటు కూటమి కౌంటర్ ఇస్తోంది. కానీ అంతకుమించి ఉత్తరాంధ్ర ప్రజలు గట్టిగానే మాట్లాడుతున్నారు ఈ అంశంపై. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం, ఉత్తరాంధ్ర ప్రజల అభిప్రాయంతో కూడిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
* గుడివాడ అమర్నాథ్ టార్గెట్..
ఓ సాధారణ వ్యక్తి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంలో చంద్రబాబుకు క్రెడిట్ ఇచ్చారు. ఉత్తరాంధ్రకు చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండడంతోనే ఇంత వేగంగా పనులు జరిగాయని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా జగన్మోహన్ రెడ్డి అప్పడాలు, తెల్లుల్లిపాయలు వేస్టు అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ అప్పడాలు, పచ్చళ్ల కంపెనీలతో ఒప్పందాలు అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. వాటిని గుర్తు చేసుకుంటూ ఓ సామాన్యుడు ఇప్పుడు మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిడిపి కూటమి ట్రోల్స్ చేస్తోంది.
View this post on Instagram