Homeఆంధ్రప్రదేశ్‌Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డిని కోరుకునే పార్టీ ఏది?!

Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డిని కోరుకునే పార్టీ ఏది?!

Vijaya Sai Reddy: ఏపీలో విచిత్ర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన విజయసాయిరెడ్డి చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఆయన అలా తిప్పించుకుంటున్నారు. పార్టీ పెడతానని ఒకసారి.. బిజెపిలో చేరుతానని… మీడియా రంగంలో రాణిస్తానని ఇంకోసారి.. అబ్బో గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తున్నారు. డిజిటల్, శాటిలైట్ మీడియా వేదికల ద్వారా పబ్లిక్ డొమైన్ లో తన వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. అయితే ఆయన చెబుతున్న లాజిక్ సింక్ కావడం లేదు. […]

Vijaya Sai Reddy: ఏపీలో విచిత్ర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన విజయసాయిరెడ్డి చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఆయన అలా తిప్పించుకుంటున్నారు. పార్టీ పెడతానని ఒకసారి.. బిజెపిలో చేరుతానని… మీడియా రంగంలో రాణిస్తానని ఇంకోసారి.. అబ్బో గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తున్నారు. డిజిటల్, శాటిలైట్ మీడియా వేదికల ద్వారా పబ్లిక్ డొమైన్ లో తన వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. అయితే ఆయన చెబుతున్న లాజిక్ సింక్ కావడం లేదు. భారతీయ జనతా పార్టీలోకి వెళితే అడ్డగించే వారే అధికం. సొంత పార్టీని ఏర్పాటు చేసేటంత ఇమేజ్ ఆయన వద్ద లేదు. చివరిగా మీడియా రంగంలో రారాజుల వెలుగొందుతానని ఆయన పెద్ద కలగంటున్నారు. కానీ అది కూడా అంత సులువు కాదు.

* కొద్దిరోజులుగా హంగామా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డి ఆ పార్టీకి ఓటమి తర్వాత.. జగన్ చుట్టూ కోటరీ ఉందని ఆరోపిస్తూ బయటకు వచ్చేసారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే రాజకీయాల్లో ఆరితేరిపోయిన ఆయన వాటిని వదిలే ప్రసక్తి లేదు అన్నట్టు మళ్లీ యూ టర్న్ తీసుకున్నారు. కొద్ది రోజులకే మళ్లీ యాక్టివ్ అవుతానని చెప్పుకొచ్చారు. కానీ ఆయన పరిణితి చెందిన నాయకుడినని… తన ముందు చాలా అవకాశాలు ఉన్నాయని.. తనపై ఒత్తిళ్లు ఉన్నాయని చెబుతూ చాలా హంగామా చేస్తున్నారు. కానీ ఏపీ రాజకీయ చదరంగంలో విజయసాయిరెడ్డి ప్రస్తుత స్థానాన్ని.. అందుబాటులో ఉన్న అవకాశాలను లాజికల్గా విశ్లేషిస్తే.. ఆయన ముందున్న మార్గాలు చాలా తక్కువ. పరిమితం కూడా.

* బిజెపిలోకి నో ఛాన్స్..
గత అనుభవాల దృష్ట్యా బిజెపిలో చేరడం చాలా సులువు అనుకున్నారు విజయసాయిరెడ్డి. ఎంచక్కా బిజెపిలోకి వెళ్లి మళ్లీ రాజకీయాలు మొదలు పెట్టవచ్చని భావించారు. టిడిపి కూటమికి ఇబ్బంది తెచ్చి పెట్టడమే కాదు జగన్మోహన్ రెడ్డిని ఒక ఆట ఆడుకోవాలని చూశారు బిజెపిలోకి వెళ్లడం ద్వారా. కానీ అప్పటికే బిజెపి వల్ల, బిజెపితో ఎలా మెలగాలి, ఎలా సఖ్యతగా ముందుకు వెళ్లాలి, అనే దానిపై టిడిపికి ఒక క్లారిటీ ఉంది. పైగా రెండు పార్టీలకు మధ్య బలమైన జనసేన ఉంది. అందుకే విజయసాయిరెడ్డి లాజిక్ పనిచేయలేదు. బిజెపిలో ప్రవేశం కుదరలేదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అది వర్క్ అవుట్ కాలేదు.

* అంతటి చరిష్మ లే..
సొంత పార్టీ ఏర్పాటు చేసేటంత చరిష్మ విజయసాయిరెడ్డికి లేదు. జగన్ పక్కన నిలబడి ఆయన గెలుపు కోసం కృషి చేసిన ఘనత విజయసాయిరెడ్డిది. అంతమాత్రాన తాను ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చేస్తానంటే కుదిరే పని కాదు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి ముందున్న ఏకైక ఆప్షన్ కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆయన అవసరం వైసీపీకి ఉంది. వైసీపీలో పని చేసిన అనుభవం విజయసాయిరెడ్డికి ఉంది. పాత నేతలు కావడం, సహచరులు కావడంతో వారితో ఇట్టే పని చేసుకుని పోగలరు. సో విజయసాయిరెడ్డి ప్రయత్నాలు, ప్రకటనలు లాజిక్ ను వెతికేవే. కానీ ఆప్షన్ మాత్రం ఆయనకు ఒకటే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper