Homeఆంధ్రప్రదేశ్‌Anil Kumar Yadav: అనిల్ కుమార్ యాదవ్ సంచలన ప్రకటన!

Anil Kumar Yadav: అనిల్ కుమార్ యాదవ్ సంచలన ప్రకటన!

Anil Kumar Yadav: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రస్థానం ముగిసినట్టే అన్న టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ ఏది చెప్తే అది చేస్తానని.. మొన్ననే నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆదేశించడంతో అలా చేశానని.. ఇప్పుడు చేయమంటే చేస్తాను లేకుంటే లేదు. కానీ నాకంటూ నెల్లూరులో ప్రత్యేక […]

Anil Kumar Yadav: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రస్థానం ముగిసినట్టే అన్న టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ ఏది చెప్తే అది చేస్తానని.. మొన్ననే నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆదేశించడంతో అలా చేశానని.. ఇప్పుడు చేయమంటే చేస్తాను లేకుంటే లేదు. కానీ నాకంటూ నెల్లూరులో ప్రత్యేక గుర్తింపు ఉంది అంటూ చెప్పుకొచ్చారు. తన ప్రస్థానం ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా రాష్ట్రానికి దూరంగా ఉన్నా ఆయన అప్పుడప్పుడు నెల్లూరు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. తాడేపల్లి పైపు కూడా పెద్దగా కనిపించడం లేదు. తాజాగా ఆయన మాటలు చూస్తుంటే తనకు ఏ బాధ్యతలు అప్పగించక పోవడాన్ని అవమానంగా ఫీల్ అవుతున్నట్లు అర్థం అవుతోంది.

* కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ..
కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో నెల్లూరు సిటీ నియోజకవర్గం ఏర్పడింది. అప్పట్లో ఆయన కార్పొరేటర్ గా ఉండడంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగారు. తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. తరువాత వైసిపి ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉండడంతో దూకుడుగా ఉండేవారు. అలా అధినేత దృష్టిలో పడిన ఆయన 2019లో రెండోసారి గెలిచేసరికి ఏకంగా మంత్రి అయ్యారు. రెండేళ్లకు పైగా మంత్రి పదవిలో ఉండేవారు. అయితే ఆయన వైఖరి కారణంగా చాలామంది బలమైన నేతలు నెల్లూరు జిల్లాలో పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ పై వ్యతిరేకత ఉందని భావించి ఆయనకు నెల్లూరు సిటీ సీటు ఇవ్వలేదు. నరసరావుపేట పార్లమెంట్ స్థానం అభ్యర్థిగా బరిలో దించారు. కానీ ఓటమి ఎదురయింది.

* అయిష్టంగానే పోటీ..
మొన్నటి ఎన్నికల్లో ఆయిష్టత గానే పోటీ చేశారు ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్. తనను నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం నుంచి తప్పించడాన్ని తట్టుకోలేక పోయారు. కానీ ఆయనకు ప్రత్యామ్నాయం అంటూ లేదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆయన పెద్దగా నరసరావుపేట పార్లమెంటు స్థానం వైపు రావడం మానేశారు. నెల్లూరు సిటీకి వేరొకరికి బాధ్యతలు కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. దీంతో తనకంటూ ఎక్కడ ఒక స్థానం లేదు. కనీసం ఏ నియోజకవర్గ బాధ్యతలు కూడా అప్పగించడం లేదు. వైసీపీని కాదని వేరే పార్టీలో చేరే పరిస్థితి కూడా లేదు. అందుకే తన ప్రస్థానం ముగిసింది అంటూ ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by TV5 News (@tv5newsnow)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper