KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(chief minister revanth Reddy) దావోస్(davos) వెళ్లిపోవడం.. నల్లగొండ జిల్లాలో చేపట్టే రైతు దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో.. భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (BRS working president KTR) తమ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో కేటీఆర్ వరుసగా భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాలు నిర్వహించిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చిట్టి నాయుడు, గుంపు మేస్త్రి అంటూ సంబోధిస్తున్నారు.. మొదట్లో ఇది కొంత వెటకారంగా ఉన్నప్పటికీ.. పదేపదే అదే తీరుగా కేటీఆర్ విమర్శించడం సొంత పార్టీ నాయకులకు కూడా నచ్చడం లేదు. అయినప్పటికీ కేటీఆర్ తన వ్యవహార శైలి మార్చుకోవడం లేదు. పైగా కరోనా సమయంలో కెసిఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడితే..ఆంధ్రా లో ఉన్న వారు యూ ట్యూబ్ లో చూసేవారని కేటీఆర్ డబ్బా కొట్టుకుంటున్నారు. వాస్తవానికి యూట్యూబ్ అనేది ప్రపంచానికి తగ్గట్టుగా మారదు. ప్రపంచం మొత్తం ఒకే విధంగా ఉంటుంది.. చూసే ప్రజల అభిరుచి ఆధారంగా యూట్యూబ్ వీడియోలను చూపిస్తూ ఉంటుంది. అంతేతప్ప తెలంగాణ ప్రజలకు తెలంగాణ వీడియోలు.. ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర వీడియోలను చూపించదు. ఐటి రంగంలో కొద్దో గొప్పో అనుభవమున్న కేటీఆర్ కూడా ఇలా మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం.
ఆ మాత్రం దానికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు..
కేటీఆర్ యూట్యూబ్ గురించి.. కెసిఆర్ మాట్లాడిన ప్రసంగాల గురించి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు..” కెసిఆర్ మంచి వాగ్దాటి ఉన్న నేత. అందులో అనుమానం లేదు. ఆ మాత్రం దానికి ఆంధ్ర ప్రజలు కూడా కరోనా సమయంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు మాత్రమే విన్నారని కేటీఆర్ అనడం హాస్యాస్పదం ఆ లెక్కన చూసుకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని ఆరోజే వదిలేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకుంటే బాగుండేది. ఆదాయం కూడా భారీగా వచ్చి ఉండేది. ఎలాగూ ఆయన తిమ్మిని బమ్మిని చేసినట్టుగా మాట్లాడతారు కాబట్టి.. జనానికి కూడా కాలక్షేపం కావాలి కాబట్టి.. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి.. కచ్చితంగా కేసీఆర్ మాటలు వినేవారు. యూట్యూబ్ కూడా భారీగానే ఆదాయం ఇచ్చేది. ఈ మాత్రం అవకాశాన్ని కేసీఆర్ ఎందుకు కోల్పోయినట్టని” నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. వాస్తవానికి ఇదే కెసిఆర్ మీద అంత నమ్మకం గనక ఆంధ్ర ప్రజలకు ఉండి ఉంటే.. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పార్టీని ఎందుకు మూసేసుకుంటారు.. మొన్నటి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయకుండా ఉండి ఉంటారు.. ఉద్యమకాలంలో ఆంధ్ర ప్రజలను ఎలాంటి మాటలు అన్నారో.. అక్కడివారు మర్చిపోతారా? రాజకీయ నాయకుల కంటే సిగ్గు ఎగ్గు ఉండవు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు.. కానీ ప్రజలు అలా కాదు కదా.. అందుకనే కేటీఆర్ లాంటి వ్యక్తులు విలేకరుల సమావేశం పెట్టినప్పుడు.. విధానపరంగా విమర్శలు చేస్తే బాగుంటుంది. వాళ్ల టార్గెట్ కాంగ్రెస్ నాయకులు కాబట్టి.. ఆ దిశగా ఆరోపణలు చేస్తే ఇంకా బాగుంటుంది.. అయినా పదేళ్ల కాలంలో ఇలాంటి పనులు చేశారో తెలంగాణ ప్రజలకు తెలియదా.. తెలంగాణ ప్రజలు అంత సులభంగా మర్చిపోతారా.. పాపం ఈ విషయాలను కేటీఆర్ మర్చిపోయినట్టున్నారు.. అందు గురించే రోజుకో తీరుగా మాటలు మాట్లాడుతున్నారు.
ఆంధ్రలో కూడా కేసీఆర్ ప్రెస్ మీట్లు చూస్తారు. కరోనా సమయంలో కేసీఆర్ ప్రెస్ మీట్లకు ప్రజలు టీవీల ముందు కూర్చునేవాళ్లు – కేటీఆర్#BRS #KTR#ktrpressmeet#KCR #andhra #carona pic.twitter.com/DmUQCHs385
— Anabothula Bhaskar (@AnabothulaB) January 20, 2025