KTR Son Himanshu Rao : స్టార్ హీరోలకు సంబంధించిన వారసులు సినీ ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇవ్వడం కొత్తేమి కాదు , గత దశాబ్దాలుగా అనాదిగా వస్తున్న ఆచారమే ఇది. అదే విధంగా ప్రముఖ రాజకీయ నాయకుల వారసులు కూడా రాజకీయాల్లోకి రావడం మాత్రమే ఇది వరకు మనమంతా చూసాము. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు ఎక్కడా హిస్టరీ లో లేదు. అయితే తొలిసారిగా రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కుమారుడు సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త. ఆ రాజకీయ నాయకుడు మరెవరో కాదు KTR. అతని కుమారుడు హిమాన్షు రావు సినీ రంగం లోకి అడుగుపెట్టేందుకు అమితాసక్తి ని చూపిస్తున్నట్టు సమాచారం.
హిమాన్షు రావు ఇప్పటికే సంగీతం లో తన ప్రతిభ ని చాటుకున్నాడు. ఇతన్ని సోషల్ మీడియా లో అనుసరించే వాళ్లకు ఈ విషయం ఈపాటికే తెలిసే ఉంటుంది. అయితే సినీ రంగం లోకి మాత్రం ఆయన హీరో గానే ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడట. ఇప్పటికే ఆయన నటన లో కోచింగ్ కూడా తీసుకున్నట్టు సమాచారం. ఒక ప్రముఖ నిర్మాత హిమాన్షు ని గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయట. టాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటున్న ఒక డైరెక్టర్ , రీసెంట్ గానే KTR ని కలిసి ఒక స్టోరీ ని కూడా వినిపించినట్టు టాక్. ఆ డైరెక్టర్ మరెవరో కాదు , అనిల్ రావిపూడి అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు కానీ , హిమాన్షు సినీ రంగ ప్రవేశానికి మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్న విషయం వాస్తవం.
ఇదంతా పక్కన పెడితే హిమాన్షు ఈ పోటీ వాతావరణాన్ని తట్టుకొని సినీ ఇండస్ట్రీ లో రాణించగలడా?, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళు ఈ కుటుంబాన్ని దేవుడిలాగా పూజిస్తుంటారు. కచ్చితంగా హిమాన్షు నటించే మొదటి సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ ని వీళ్ళు అందిస్తారు. కానీ ఆ తర్వాత ఆయన దాన్ని నిలబెట్టుకొని ఇండస్ట్రీ లో ఎలాంటి కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తాడు అనేదే చూడాలి.