Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి కీలక పరిణామం. కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉక్కు పరిశ్రమ భద్రతకు సంబంధించి బాధ్యతలు చూస్తున్న సిఐఎస్ఎఫ్ బలగాల ఉపసంహరణకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. 2026 నవంబర్ 17 నుంచి సెక్యూరిటీ, ఫైర్ వింగ్ లలో ఉన్న బలగాలను ఉపసంహరించాలని అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఆర్డర్ కాపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రక్రియను మూడు నెలల నోటీస్ పీరియడ్ తర్వాత చేపట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈలోగా విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి సిఐఎస్ఎఫ్ కు రావాల్సిన బకాయిలన్నీ ముందుగా చెల్లించాలని కేంద్ర హోం శాఖ సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
* పారిశ్రామిక భద్రత..
సాధారణంగా పరిశ్రమలకు సంబంధించి భద్రతను సిఐఎస్ఎఫ్ చూస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి నాలుగు వందల మంది వరకు సిఐఎస్ఎఫ్, సెక్యూరిటీ, ఫైర్ విభాగం సిబ్బందిని గతంలోని తొలగించారు. అనంతరం వారి స్థానంలో ఏపీ స్పెషల్ ఫోర్స్ బలగాలను నియమించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో 2024 వరకు 1500 మంది వరకు సిఐఎస్ఎఫ్ బలగాలు విధుల్లో ఉండేవారు. అటు తరువాత దశలవారీగా సిబ్బందిని ఉపసంహరించుకున్నారు. తాజాగా 350 మంది సెక్యూరిటీ, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది వీధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిని కూడా ఉపసంహరించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిందన్న అంశం చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లోని సిఐఎస్ఎఫ్ బలగాలకు సంబంధించి.. భద్రతా విభాగంలో 1033 మంది, అగ్నిమాపకం విభాగంలో 298 మంది విధుల్లో ఉన్నారు.
* ఒక్కసారిగా ఆందోళన..
దశాబ్దాలుగా భారతదేశంలోని ప్రధాన ప్రభుత్వ రంగ సంస్థలు, కీలక పారిశ్రామిక సంస్థల భద్రత వ్యవస్థలు సిఐఎస్ఎఫ్ ఒక అంతర్భాగంగా ఉంది. కేవలం భద్రత మాత్రమే కాదు ఫైర్ సేఫ్టీ బాధ్యతలను కూడా నిర్వహిస్తోంది. అటువంటి సిఐఎస్ఎఫ్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ భద్రతా బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఏపీ స్పెషల్ ఫోర్స్ బలగాలను నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. సిఐఎస్ఎఫ్ జారీ చేసిన నోటిసు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
CISF Security Withdrawal from Vizag Steel Plant
Andhra Pradesh The Centre has ordered the withdrawal of CISF personnel from Visakhapatnam Steel Plant by November 17. About 350 security&120 fire safety personnel are currently deployed Move has raised concerns over plant security pic.twitter.com/CWn1VQa74m
— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) August 21, 2026