Homeఆంధ్రప్రదేశ్‌Murusu Cyclone: మురసు తుఫాన్ భయపెట్టినా.. దయగల ప్రభుత్వం జనాలను ఆదుకుంది.. సెల్యూట్ చంద్రబాబు సార్..

Murusu Cyclone: మురసు తుఫాన్ భయపెట్టినా.. దయగల ప్రభుత్వం జనాలను ఆదుకుంది.. సెల్యూట్ చంద్రబాబు సార్..

Murusu Cyclone: మురసు తుఫాన్ ఏపీ ప్రజల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. బీభత్సమైన గాలులు, అదేస్థాయిలో వర్షం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోంది. బాపట్ల పట్టణంలో చెట్లు కూలిపోయాయి. విపరీతమైన గాలికి విద్యుత్ తీగల మీద పడిపోయాయి. అర్ధరాత్రి పూట అధికారులు వాటిని తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సూర్యలంక బీచ్ రోడ్లో.. రహదారి మీద చెట్టు కూలిపోయింది.. నీతో వెంటనే దానికి తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా […]

Murusu Cyclone: మురసు తుఫాన్ ఏపీ ప్రజల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. బీభత్సమైన గాలులు, అదేస్థాయిలో వర్షం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోంది.

  • బాపట్ల పట్టణంలో చెట్లు కూలిపోయాయి. విపరీతమైన గాలికి విద్యుత్ తీగల మీద పడిపోయాయి. అర్ధరాత్రి పూట అధికారులు వాటిని తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
  • సూర్యలంక బీచ్ రోడ్లో.. రహదారి మీద చెట్టు కూలిపోయింది.. నీతో వెంటనే దానికి తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు.
  • బాపట్ల.. ముత్తాయపాలెం రోడ్డు మీద చెట్లు కూలిపోతే వెంటనే ఏపీఎస్ఆర్టీఎఫ్ బృందం రంగంలోకి దిగి వాటిని తొలగించింది.
  • వింజనంపాడు ఓఎం రోడ్డులో చెట్ల కూలిపోతే సిబ్బంది వెంటనే స్పందించి తొలగించారు.. విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
  • బాపట్ల పెద్ద నందిపాడు రోడ్డులో నాగులపాడు గ్రామ సమీపంలో చెట్టు కూలిపోతే.. సిబ్బంది వెంటనే స్పందించి.. రహదారి మీద రాకపోకలను పునరుద్ధరించారు.
  • అమరావతి సెక్షన్ పరిధిలో ధరణికోట గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పాడైపోతే.. సిబ్బంది వెంటనే మార్చారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు..
  • నరసరావుపేట ఎస్ఎస్1 వద్ద విద్యుత్ తీగలు తెగిపడిపోతే.. వెంటనే సిబ్బంది రంగంలోకి దిగారు. రిపేర్లు చేసి సరఫరాను పునరుద్ధరించారు.
  • చిలకలూరిపేట పరిధిలో గణపవరం శాంతినగర్.. నరసరావుపేట రోడ్డులో కూలిన చెట్టును అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
  • పల్నాడు జిల్లా శావల్యపురం మండలం కనమర్లపూడి సమీపంలో 544 డి జాతీయ రహదారి మీద భారీ చింత చెట్టు కూలిపోతే.. సిబ్బంది వెంటనే స్పందించి తొలగించారు. రహదారి మీద రాకపోకలను పునరుద్ధరించారు..

ఇది కేవలం ఉదాహరణలు మాత్రమే.. ఇంకా సిబ్బంది చేసినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ రాయడం ఎంత ఉద్దేశం ఏంటంటే.. ప్రకృతి విపత్తులు అనేవి ఏవో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా జనజీవనాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ప్రకృతి విపత్తులను అడ్డుకోవడం సాధ్యం కాదు. కాకపోతే ప్రకృతి విపత్తుల వల్ల జరిగే నష్టాన్ని మాత్రం సాధ్యమైనంతవరకు తగ్గించడం మన చేతుల్లో ఉంటుంది.

ఒక ప్రభుత్వానికి ప్రజల మీద ప్రేమ ఉంటే.. ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే కచ్చితంగా ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో కూడా అదే చేస్తోంది. ప్రజలు ఇబ్బంది పడకుండా.. విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించింది. అంతేకాదు తమిళనాడు.. కర్ణాటక.. తెలంగాణ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడంతో.. అక్కడినుంచి సిబ్బందిని రప్పించుకుంది ఏపీ ప్రభుత్వం. వారి ద్వారా కూడా విద్యుత్ సేవలు పొందుతోంది. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండడంతో పొరుగు రాష్ట్రాల కార్మికులతో ఎప్పటికప్పుడు పునరుద్ధరణ పనులు చేపడుతోంది. తద్వారా ప్రజలు చీకట్లో మగ్గిపోకుండా వెంటనే సహాయక చర్యలు చేపడుతోంది.

అర్నబ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పైగా వారి ఖాతాలో అన్నదాత సుఖీభవ నిధులు కూడా జమ చేసింది. దీనికి తోడు ఇప్పుడు మురుసు తుఫాన్ వల్ల నష్టపోతున్న రైతులను కూడా ఆదుకుంటామని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారికి మూడు పూటలా భోజనాలు పెడుతుంది. అంతేకాదు ఆస్తి నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది.

ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా నిలబడితే అక్కడి ప్రజల్లో లభించే భరోసా మామూలుగా ఉండదు. ఏపీ ప్రజలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చే భరోసా వల్ల తాము సురక్షితంగా ఉన్నామని.. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ.. అవి తమను అంతగా ప్రభావితం చేయలేకపోతున్నాయని వారు చెబుతున్నారు. ఒక నాయకుడికి.. కార్యసాధకుడికి రాష్ట్రాన్ని అప్పగిస్తే కష్ట కాలంలో ఇదిగో ఇలాంటి ఫలితమే వస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper