Rapthadu Incident: రాప్తాడు లో పదవ తరగతి చదువుతున్న బాలిక మీద రంపంతో దాడి చేసిన యువకుడి పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆరు రౌండ్ ల బుల్లెట్లు అతడి రెండు కాళ్లల్లోకి దిగాయి. ఒక కాలులో తీవ్రస్థాయిలో బుల్లెట్లు దిగిపోవడంతో రక్తప్రసరణ వ్యవస్థ ఆగిపోయింది. గ్యాంగ్రిన్ సోకింది. దీంతో వైద్యులు అతడి కాలును తొలగించారు.
ఇది ఏపీ పోలీసులు చేసిన సత్వర న్యాయం. వాస్తవానికి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం.. సరైనది కాదు. కానీ కొన్ని సందర్భాలలో పంటికి పన్ను.. కంటికి కన్ను అనే సిద్ధాంతాన్ని అమలు చేయాల్సిందే. ముఖ్యంగా ఆడబిడ్డల జోలికి వస్తే ఖబడ్దార్ అన్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సరిగ్గా కొద్ది రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు ఒక సభలో ఆగ్రహంగా మాట్లాడారు. ఆడపిల్లల భద్రత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంబోతుల మాదిరిగా ఆడపిల్లల మీదకు వచ్చే ఉన్మాదులకు అదే ఆఖరి రోజు అని చెప్పారు. చెప్పినట్టుగానే వ్యవస్థను మొత్తం పూర్తిగా మార్చేశారు. వాస్తవానికి హింస అనేది చంద్రబాబు నైజం కాదు. పైగా క్షమాగుణం ఆయనలో విపరీతంగా ఉంటుంది. కానీ ఆడపిల్లల మీద చేస్తున్న దారుణాలు.. చోటుచేసుకుంటున్న దాడులు అవన్నీ కూడా ఆయనను ఆ స్థాయిలో ఆగ్రహంగా మార్చాయి.
కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో అనకాపల్లిలో ఒక బాలికను ఒక వ్యక్తి దారుణంగా చంపాడు. కానీ ఆ తర్వాత అతడు పోలీసులు పట్టుకుంటారని.. కఠినంగా శిక్షిస్తారని భయపడి పురుగుల మందు తాగి చనిపోయాడు..
2025లో కడపలో మూడేళ్ల బాలికను ఓ దుర్మార్గుడు చంపాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని పట్టుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. చివరికి డ్యామ్ లో దూకి చచ్చాడు.
2025 లో అక్టోబర్ నెలలో తునిలో ఒక బాలిక మీద ఓ మూర్ఖుడు అత్యాచారం చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని పట్టుకున్నారు. విచారణ నిమిత్తం జైలుకు తరలిస్తుండగా అతడు చెరువులో దూకి చనిపోయాడు.
ఈ ఘటనలు ఏపీలో జరిగాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సత్వర న్యాయం లభించింది. కాకపోతే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా అనే ప్రశ్న ఇక్కడ రావచ్చు. కానీ అకారణంగా.. ఎటువంటి సంబంధం లేకుండా ఒక మనిషి మీద ఇంకో మనిషి దాడి చేయడం లేదా చంపేయడం అత్యంత క్రూరమైనది. చనిపోయిన వాళ్ళ కుటుంబాలు పడేవేదన మామూలుగా ఉండదు. ఆ వేదన తీర్చడానికే ప్రభుత్వం రంగంలోకి దిగి సత్వర చర్యలు తీసుకుంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అనంత బాబు విషయంలో కనీస చర్యలు తీసుకోలేదు. అంతేకాదు అప్పలరాజు కుమారుడు ఒక వ్యక్తిని బైక్ తో గుద్ధి చంపేస్తే చిన్న పిల్లోడు అని జగన్ వెనకేసుకొచ్చారు. అంతేకాదు రౌడీషీటర్ సాయి కృష్ణ వ్యవహారంలో జగన్ ఇలానే వ్యవహరించారు. మత్తు పదార్థాల బృందం విషయంలో కూడా జగన్ వెనకేసుకుని వచ్చి మాట్లాడారు. చివరికి రాప్తాడు ఘటనకు పాల్పడిన యువకుడికి అనుకూలంగా వైసీపీ లాయర్లు కోర్టులో కేసు వేశారు.
ఈ ఉదాహరణలు చాలు ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరు.. నేరస్తుల కోసం పనిచేస్తున్న వ్యక్తులు ఎవరో చెప్పడానికి.. ఆడపిల్లల మానప్రాణాలకు ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుంది. అది ప్రభుత్వ బాధ్యత కూడా. కానీ ఈ విషయాన్ని మర్చిపోయి.. ప్రతిపక్ష హోదాను కోల్పోయి.. వైసిపి వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజాన్ని తలవంచుకునేలా చేస్తుంది.