Amaravati Railway Station: ఏపీ రాజధాని అమరావతిలో మరో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మాణం కాబోతోంది. దీనికోసం ఏకంగా 22 45 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిధులతో అమరావతిలో అతిపెద్ద రైల్వే స్టేషన్ నిర్మించబోతున్నారు. దీనిని విమానాశ్రయాన్ని తలపించే విధంగా రూపొందించబోతున్నారు. రైల్వే స్టేషన్లో 24 ఫ్లాట్ ఫారాలు.. నాలుగు టెర్మినల్స్ ఉంటాయని తెలుస్తోంది.
లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే విధంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. హైదరాబాద్.. చెన్నై.. బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు రైల్వే కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకంగా కాబోతోంది. అమరావతిలో ప్రతిపాదిత రైల్వే స్టేషన్ ను 1500 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబోతున్నారు. ఇందులో 24 ఫ్లాట్ ఫారాలు.. నాలుగు అతిపెద్ద టెర్మినల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. విమానాశ్రయాలలో కనిపించే తరహాలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి అనేది ఈ ప్రతిపాదనలో ప్రధాన ఉద్దేశం గా తెలుస్తోంది. ప్రతిరోజు సుమారు 3 లక్షల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించగలిగేలా ఈ కేంద్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో పెరిగే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం.
అమరావతికి రైల్వే కనెక్టివిటీని కల్పించేందుకు ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ రైల్వే నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నది మీద 3.2 కిలోమీటర్ల పొడవైన భారీ రైల్వే వంతెన నిర్మించబోతున్నారు. ఈ రైల్వే లైన్ ద్వారా విజయవాడ హైదరాబాద్ రైల్వే మార్గాన్ని.. విజయవాడ.. గుంటూరు మార్గాన్ని అనుసంధానించబోతున్నారు. తద్వారా అమరావతి ప్రాంతానికి నేరుగా రైల్వే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు కేంద్ర మంత్రివర్గం 2024 అక్టోబర్ లో 2245 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం తెలిపింది.
అమరావతి రైల్వే ప్రాజెక్టు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే బుల్లెట్ ఫైల్ కనెక్టివిటీ. హైదరాబాద్.. చెన్నై.. హైదరాబాద్.. బెంగళూరు బుల్లెట్ రైలు మార్గాలు అమరావతి మీదుగా వెళ్లే ప్రతిపాదనలో ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నగరానికి సుమారు 70 నిమిషాలు.. చెన్నై నగరానికి 112 నిమిషాలు.. బెంగళూరుకు రెండు గంటల్లో చేరుకునే అవకాశాల గురించి కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది.. ఈ రైల్వేలో అత్యంత ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సమాచారం. ప్రయాణికుల కోసం ఆధునిక వెయిటింగ్ లాంజ్ లు నిర్మించబోతున్నారు. డిజిటల్ టికెటింగ్ సదుపాయాలు కల్పించబోతున్నారు. ఆటోమేటెడ్ ఎంట్రీ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే భద్రత కోసం కవచ్ అనే వ్యవస్థను నిర్మించబోతున్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా ఏర్పాటు చేయబోతున్నారు. వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక డిజైన్ రూపొందిస్తున్నారు. కృష్ణానది సమీపంలో ఈ రైల్వే ప్రాజెక్టు ఉన్న నేపథ్యంలో వరద ముప్పును అంచనా వేయడానికి 100 ఏళ్ల సమాచారాన్ని లెక్కలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించిన భూసేకరణ.. టెండర్ల ప్రక్రియ అత్యంత కీలకం. తాజా సమాచారం ప్రకారం రైల్వే లైన్ లో వడ్డమాను.. నంబూరు విభాగానికి టెండర్లను ఆహ్వానించారు. ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి నాలుగు ప్యాకేజీలుగా పనులను విభజించారు. అమరావతి రైల్వే ప్రాజెక్టు పూర్తి అయితే రాజధాని ప్రాంతానికి రైలు ప్రయాణం మారిద్ద సులభం అవుతుంది. విజయవాడ.. గుంటూరు ప్రాంతాల మధ్య ప్రస్తుతమున్న రవాణా ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. వాణిజ్యం.. పర్యాటకం.. పారిశ్రామిక కార్యకలాపాలకు ఈ కనెక్టివిటీ ఉపయోగపడుతుంది.