Homeఆంధ్రప్రదేశ్‌Jagan: కాంగ్రెస్ లో వైసీపీ విలీనం.. జగన్ సంచలన అడుగులు?

Jagan: కాంగ్రెస్ లో వైసీపీ విలీనం.. జగన్ సంచలన అడుగులు?

Jagan: సార్వత్రిక ఎన్నికల తర్వాత రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తెలంగాణలో విపక్ష బీఆర్‌ఎస్‌ను ఖాళీ చేసేందకు అధికార కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ మొదలు పెట్టింది. దీంతో గులాబీ పార్టీ అప్రమత్తమైంది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం పూర్తయింది. స్పీకర్‌ ఎన్నిక జరిగింది. తొలి కేబినెట్‌ భేటీ కూడా జరిగింది. అధికార కూటమికి 164 సీట్లు రాగా, విపక్ష వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. దీంతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఈ క్రమంలో జగన్‌ అసెంబ్లీకి వస్తారా.. వచ్చినా తట్టుకుని నిలబడతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

విలీనం ప్రతిపాదన..
ఈ క్రమంలో పులివెందుల నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటించిన మాజీ సీఎం, వైసీపీ చీఫ్‌ జగన్‌మోహన్‌రెడ్డి అటు నుంచి అటే బెంగళూరు వెళ్లారు. మూడు రోజులు నియోజకవర్గంలో పార్టీ ఓటమిపై మేధోమధనం చేసిన జగన్‌.. ప్రస్తుత పరిస్థితిలో కూటమిని ఎదుర్కొనేందుకు పార్టీ విలీన ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఉనికే లేని కాంగ్రెస్‌తో వైసీపీని విలీనం చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు తన ప్రతిపాదనను కర్ణాక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌ ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. తన చెల్లెలు షర్మిలను తప్పిస్తే.. వైసీపీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేస్తానని ఆఫర్‌ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది.

అధికార కూటమివైపు ఎమ్మెల్యే చూపు..
ప్రస్తుతం వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎంత మంది పార్టీలో ఉంటారు అనేది తెలియని పరిస్థితి. ఈ క్రమంలో పార్టీని తల్లి కాంగ్రెస్‌లో విలీనం చేయడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈమేరకు తన ప్రతిపాదనను డీకే శివకుమార్‌ ముందు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

బీజేపీలోకి విజయసాయిరెడ్డి..?
ఇదిలా ఉంటే.. ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ నాలుగు లోక్‌సభ సీట్లు గెలిచింది. దీంతో ఈ నలుగురిలో కూడా ఎంత మంది పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. జగన్‌ దూతగా వ్యవహరించే ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఈమేరకు ఇపన్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వైసీపీ ఉనికే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో జగన్‌ తన ఉనికి కాపాడుకునేందుకే కాంగ్రెస్‌లో వైసీపీ విలీన ప్రతిపాదన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper