Ravi Prakash TV9 Issue: ఇప్పటికీ అది ఒక చిదంబర రహస్యం. ఏం జరిగిందో తెలియదు. రవి ప్రకాష్ కోట్లు మోసం చేశాడు అంటారు. కంపెనీ ప్రమోటర్లను ముంచాడు అంటారు. ఆయన వల్ల టీవీ9 యాజమాన్యం నిండా మునిగింది అంటారు. దీనికి సంబంధించిన కేసు కూడా కోర్టులో ఉంది. ఆ మధ్య కోర్టు విచారణకు రవిప్రకాష్ హాజరయ్యారు కూడా. ఇన్నాళ్లకు టీవీ9 ఏర్పాటు.. రవి ప్రకాష్ మోసాలు చేశాడా లేదా తనే బాధితుడిగా మారిపోయాడా.. మధ్యలో శ్రీని రాజు ఎందుకు వెళ్లిపోయారు.. అనేక విషయాలపై క్లారిటీ వచ్చింది.
శ్రీని రాజు, రవి ప్రకాష్ 2004లో టీవీ9 సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ 24 గంటల పాటు వార్తలను ప్రసారం చేస్తూ సరికొత్త ఒరవడి సృష్టించింది. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. టీవీ9 ఛానల్ 2004లో ఏర్పాటు అయింది.. దాదాపు 2019 వరకు రవి ప్రకాష్ అందులో ఉన్నారు. ఆ తర్వాత ఆ సంస్థ చేతులు మారింది. ఇప్పుడు మై హోమ్, మెఘా సంస్థలు ఈ చానెల్ ను నిర్వహిస్తున్నాయి. టీవీ9 సంస్థను శ్రీని రాజు అమ్మేశారు. నాడు ఆయన అమ్ముతున్నప్పుడు కొనుగోలుదారులను కూడా రవి ప్రకాష్ తీసుకొచ్చారు.
తనకు వస్తున్న ఒత్తిడులను తట్టుకోలేక శ్రీని రాజు టీవీ9 సంస్థను అమ్మేశారు. ఆ రోజుల్లోనే భారీ అమౌంట్ కు(దాదాపు 200 కోట్లు అంటున్నారు) అమ్మేశారు. వచ్చిన ప్రమోటర్లకు.. రవి ప్రకాష్ కు విభేదాలు వచ్చాయి. ఫలితంగా రవి ప్రకాష్ బయటకి వెళ్లిపోయారు. రవి ప్రకాష్ ఆర్థికంగా అక్రమాలకు పాల్పడడం వల్లే ఇదంతా జరిగిందని నిన్నటి వరకు ప్రచారంలో ఉండేది. పైగా ఆయనను టీవీ 9 సంస్థ నుంచి అవమానకరంగా బయటకి పంపేశారు. ఈ క్రమంలో శ్రీని రాజు ఇన్నాళ్లకు నోరు విప్పారు. ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన టీవీ9 నుంచి రవి ప్రకాష్ ఎందుకు వెళ్లిపోయాడు.. ఏం జరిగింది అనే విషయాలను స్పష్టం చేశారు.
శ్రీని రాజు ఈ విషయాలను బయటపెట్టి నేపథ్యంలో రవి ప్రకాష్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు..”మీరు ఇన్నాళ్లకు అసలు వాస్తవాలు చెప్పారు. టీవీ9 సంస్థ ఏర్పాటు.. దానిని ఈ స్థాయి దాక తెచ్చిన తీరు గొప్పగా ఉంది. మన ప్రయాణం ముగిసిపోలేదు. వచ్చే రోజుల్లో కూడా సాగుతూ ఉంటుంది. మీరు చెప్పిన విషయాలు అప్పటి రోజులను మదిలో మెదిలేలా చేస్తున్నాయి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు.. నిజాలు నిలిచి ఉంటాయని” రవి ప్రకాష్ వ్యాఖ్యానించారు. మరోవైపు కొత్త యాజమాన్యం రవి ప్రకాష్ ను మోసం చేసిందని.. అందువల్లే ఆయన బయటికి వెళ్లిపోయారని తెలుస్తోంది. రవి ప్రకాష్ టీవీ నైన్ నుంచి బయటికి వెళ్లిపోయిన తర్వాత మోజో అనే పేరుతో టీవీ ఛానల్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దానిని మూసివేశారు. ఇప్పుడు ఆర్ టీవీ పేరుతో ఛానల్ ఏర్పాటు చేశారు.
డియర్ శ్రీని,
తెలుగులో మొదటి 24 గంటల వార్తా ఛానల్ అయిన @TV9Telugu నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.
నా కలల TV9కి పునాది వేసిన మీ పెట్టుబడికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను.మనం రెండు దశాబ్దాల పాటు ఒక అద్భుతమైన ప్రయాణాన్ని సాగించాము.
మధ్యలో కొందరు మోసగాళ్ల… pic.twitter.com/stFsHNTtdn— Ravi Prakash Official (@raviprakash_rtv) June 14, 2026
