Homeటాప్ స్టోరీస్Basara Temple: ఆ పత్రికలో బాసర చిచ్చు.. పదివేల రూపాయల ఫైన్.. ఏం జరిగింది..

Basara Temple: ఆ పత్రికలో బాసర చిచ్చు.. పదివేల రూపాయల ఫైన్.. ఏం జరిగింది..

Basara Temple: ఆ పత్రికలో బాసర పుణ్యక్షేత్రం చిచ్చురేపింది. ఏకంగా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రకంపనలకు దారితీసింది. చివరికి పదివేల రూపాయల ఫైన్ చెల్లించాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకు జరిగింది.. ఇంతకీ ఏం జరిగింది.. ఆ పత్రికకు బాసర ప్రాంతాన్ని పర్యవేక్షించే ఒక విలేకరి ఉన్నాడు. ఆయనకు ఆ ప్రాంతంలో పట్టు అధికంగా ఉంటుంది. పైగా ఆ పత్రికకు భారీగా ప్రకటనలు సేకరిస్తూ ఉంటాడు. సర్కులేషన్ విషయంలో కూడా అతడు అదే జోరు […]

Basara Temple: ఆ పత్రికలో బాసర పుణ్యక్షేత్రం చిచ్చురేపింది. ఏకంగా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రకంపనలకు దారితీసింది. చివరికి పదివేల రూపాయల ఫైన్ చెల్లించాల్సి వచ్చింది. ఇదంతా ఎందుకు జరిగింది.. ఇంతకీ ఏం జరిగింది..

ఆ పత్రికకు బాసర ప్రాంతాన్ని పర్యవేక్షించే ఒక విలేకరి ఉన్నాడు. ఆయనకు ఆ ప్రాంతంలో పట్టు అధికంగా ఉంటుంది. పైగా ఆ పత్రికకు భారీగా ప్రకటనలు సేకరిస్తూ ఉంటాడు. సర్కులేషన్ విషయంలో కూడా అతడు అదే జోరు చూపిస్తూ ఉంటాడు. అతడికి ఆ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ తో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇటీవల ఆ పత్రికకు కొత్తగా ఎడిషన్ ఇన్చార్జి వచ్చాడు. కొద్దిరోజులపాటు ఆ ప్రాంతం మీద అవగాహన పెంచుకున్నాడు. ఆ తర్వాత అతడు తన జోరు చూపించడం మొదలుపెట్టాడు. వాస్తవానికి అతడిది ఆ ప్రాంతం కాదు. ప్రమోషన్ మీద వేరే జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాడు.

ఆ జిల్లా మీద పట్టు రావడంతో.. తన అసలు సిసలైన మాయాజాలాన్ని మొదలుపెట్టాడు. తన ప్రాంతం నుంచి చాలామందిని బాసర తీసుకొచ్చాడు. ఈ కార్యక్రమం విడతల వారీగా జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. బాసర ప్రాంతంలో దర్శనం.. వచ్చే వాళ్లకు మందు.. విందు.. ఇతర ఖర్చులు మొత్తం బాసర రిపోర్టర్ మీద వేశాడు. మొత్తంగా ఆ ఖర్చు భారీగానే దాటింది. తాను అంత ఖర్చు ఎందుకు పెట్టుకోవాలని ఆ విలేకరి ప్రశ్నిస్తే.. సదరు ఎడిషన్ ఇంచార్జ్.. రుబాబు చూపించాడు. తనకు పై స్థాయిలో ఉన్న వ్యక్తులు తెలుసని.. వాళ్లకు తాను అత్యంత ప్రియ శిష్యుడిని అని చెప్పుకున్నాడు.. దీంతో ఆ బాసర రిపోర్టర్ ఆ ఖర్చు మొత్తం పెట్టుకున్న తర్వాత.. ఈ విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత తన పోస్టుకు రిజైన్ చేసి వేరే ఛానల్ కి వెళ్లిపోయాడు.

ఈ వ్యవహారం పై స్థాయి దాకా వెళ్ళింది. విచారణ మొదలైంది. అయితే ఆ ఎడిషన్ ఇంచార్జ్ బాసర టూర్ మొత్తాన్ని కమర్షియల్ గా మార్చేశాడు. తన ప్రాంతం నుంచి తీసుకొచ్చిన వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఆ భారం మొత్తం రిపోర్టర్ మీద వేశాడు. విచారణలో ఈ విషయం తెలియడంతో ఆ ఎడిషన్ ఇన్చార్జి నుంచి అక్షరాలా 10000 రూపాయలు ఆ రిపోర్టర్కు చెల్లించాలని మేనేజ్మెంట్ ఆదేశించింది. దీంతో ఎడిషన్ ఇంచార్జ్ డబ్బులు చెల్లించాడు. ఇక్కడితోనే కథ అయిపోలేదు. ఆ జిల్లాకు కొత్తగా ఎడిషన్ ఇన్చార్జిను నియమించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న ఎడిషన్ ఇన్చార్జికి స్థాన చలనం కలిగిస్తారని సమాచారం.. ఇప్పటికే ఓ ప్రధాన పత్రిక నుంచి ఒక వ్యక్తిని తీసుకున్నారని.. మరి కొద్ది రోజుల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని తెలుస్తోంది. విలేఖరికి పత్రికా యాజమాన్యం ఇచ్చేది అంతంత మాత్రం. అలాంటిది ఎడిషన్ ఇంచార్జి కక్కుర్తి వల్ల.. ఆ రిపోర్టర్ 10000 వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. చివరికి ఆ రిపోర్టర్ ధైర్యం చేయడంతో ఎడిషన్ ఇంచార్జ్ పరువు పోయింది . అందుకే కక్కుర్తి పడకూడదు.. ఎడిషన్ ఇన్చార్జి స్థాయిలో ఉన్న వ్యక్తి పక్కా కమర్షియల్ మాదిరిగా ఆలోచించకూడదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper