Homeక్రీడలుక్రికెట్‌Ajinkya Rahane Retirement: బిగ్ బ్రేకింగ్: టీమిండియా సీనియర్ క్రికెటర్ రిటైర్మెంట్

Ajinkya Rahane Retirement: బిగ్ బ్రేకింగ్: టీమిండియా సీనియర్ క్రికెటర్ రిటైర్మెంట్

Ajinkya Rahane Retirement: భారత జట్టులో సీనియర్ క్రికెటర్.. మూడు ఫార్మాట్లో అదరగొట్టిన ఆటగాడు.. తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సృష్టించుకున్న ప్లేయర్.. రిటర్మెంట్ ప్రకటించాడు. భావోద్వేగమైన పోస్ట్ పెట్టి.. ఇకపై క్రికెట్ ఆడేది లేదని పేర్కొన్నాడు. టీమిండియాలో ప్రత్యేకమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు అజింక్య రహనే. టెస్ట్.. వన్డే.. టి20 లో అదరగొట్టాడు. అంతేకాదు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియా గడ్డమీద టీమిండియా విజేతగా నిలవడంలో రహానే కీలకపాత్ర పోషించాడు. తనకంటూ ప్రత్యేకమైన క్లాసిక్ షాట్లతో […]

Ajinkya Rahane Retirement: భారత జట్టులో సీనియర్ క్రికెటర్.. మూడు ఫార్మాట్లో అదరగొట్టిన ఆటగాడు.. తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సృష్టించుకున్న ప్లేయర్.. రిటర్మెంట్ ప్రకటించాడు. భావోద్వేగమైన పోస్ట్ పెట్టి.. ఇకపై క్రికెట్ ఆడేది లేదని పేర్కొన్నాడు.

టీమిండియాలో ప్రత్యేకమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు అజింక్య రహనే. టెస్ట్.. వన్డే.. టి20 లో అదరగొట్టాడు. అంతేకాదు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియా గడ్డమీద టీమిండియా విజేతగా నిలవడంలో రహానే కీలకపాత్ర పోషించాడు. తనకంటూ ప్రత్యేకమైన క్లాసిక్ షాట్లతో ఇతడు అలరించేవాడు. ఆవేశానికి పోకుండా.. ప్రశాంతమైన ఆట తీరితో ఆకట్టుకునేవాడు.

ఇతడు కెరియర్లో టీమిండియా ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. ముఖ్యంగా 2021 -22 సీజన్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకునేలాగా ఆడాడు. నాడు అడిలైడ్ టెస్టులో టీ మీడియా కేవలం 36 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలవల్ల ఇండియాకు వెళ్లిపోయాడు. పైగా ఆటగాళ్లు కూడా గాయాలతో సతమతమవుతున్నారు. ఈ దశలో జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు రహానే. మెల్బోర్న్ గ్రౌండ్లో జరిగిన టెస్టులో సూపర్ సెంచరీ చేసి అదరగొట్టాడు . అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డమీద టీమిండియా 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ సొంతం చేసుకునేలాగా కృషి చేశాడు.

రహనే అంతర్జాతీయ కెరియర్లో మొత్తంగా 85 టెస్టులు.. 90 వన్డేలు.. 20 t20 మ్యాచ్ లు ఆడాడు. మూడు ఫార్మాట్లు కలిపి మొత్తంగా ఎనిమిది వేలకు పైగా పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్లో ఏకంగా 5077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా విదేశాలలో.. భారత జట్టు కష్టాలలో ఉన్నప్పుడు ఇతడు ఆడిన ఇన్నింగ్స్ లు అద్భుతమైనవి. విదేశీ గడ్డల మీద భారతీయ జట్టుకు అత్యంత నమ్మకమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 2017 వన్డే ప్రపంచ కప్.. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2023 జూలైలో వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ ఇతడికి చివరి అంతర్జాతీయ మ్యాచ్.

రహానే ప్రశాంతమైన స్వభావం కలిగి ఉంటాడు. ఏ దశలో కూడా ఆవేశానికి గురికాడు. స్థిరమైన ఆట తీరుతో ఆకట్టుకుంటాడు. ప్రత్యర్థి బౌలర్ల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి.. ప్రతి అవకాశాన్ని కూడా వాడుకుంటాడు. అందువల్లే అతడు అన్ని ఫార్మాట్లలో తిరుగులేని ఆటగాడిగా రూపాంతరం చెందాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper