Homeఆంధ్రప్రదేశ్‌Kota Vinutha: ఇరుముడి సినిమా ప్రభంజనం.. కోట వినూత బయటికి వచ్చింది.. సంచలన వీడియో..

Kota Vinutha: ఇరుముడి సినిమా ప్రభంజనం.. కోట వినూత బయటికి వచ్చింది.. సంచలన వీడియో..

Kota Vinutha: రవితేజ హీరోగా నటించిన ఇరుముడి సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. అంతగా అంచనాలు లేకుండానే విడుదలైన ఈ సినిమా బ్రహ్మాండమైన వసూళ్లను సాధిస్తోంది. ఈ సినిమా విజయం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రవితేజను.. సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ యాజమాన్యాన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ జాబితాలోకి శ్రీకాళహస్తి ఒకప్పటి జనసేన నాయకురాలు కోట వినూత కూడా చేరిపోయారు. కోట వినుత అనగానే డ్రైవర్ రాయుడు హత్య కేసు గుర్తుకొస్తుంది. కోట వినుత […]

Kota Vinutha: రవితేజ హీరోగా నటించిన ఇరుముడి సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. అంతగా అంచనాలు లేకుండానే విడుదలైన ఈ సినిమా బ్రహ్మాండమైన వసూళ్లను సాధిస్తోంది. ఈ సినిమా విజయం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రవితేజను.. సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ యాజమాన్యాన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు.

ఈ జాబితాలోకి శ్రీకాళహస్తి ఒకప్పటి జనసేన నాయకురాలు కోట వినూత కూడా చేరిపోయారు. కోట వినుత అనగానే డ్రైవర్ రాయుడు హత్య కేసు గుర్తుకొస్తుంది. కోట వినుత జనసేన శ్రీకాళహస్తి ఇన్చార్జిగా పని చేశారు. 2024 ఎన్నికల్లో శ్రీకాళహస్తి టికెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ టికెట్ బొజ్జల సుధీర్ రెడ్డికి వెళ్ళింది. ఆయన టిడిపి తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే వినూత తన దగ్గర పని చేసే రాయుడును తన భర్త సహకారంతో హత్య చేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పటికే కోట వినుత భర్త అరెస్టు అయ్యారు. జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కోట వినూత బెయిల్ మీద విడుదలయ్యారు.

తాజాగా కోట వినుత ఇరుముడి సినిమా చూశారు. ఆ సినిమాలో ఆడపిల్లల పెంపకం.. ఆడపిల్లలను ఏ విధంగా చూడాలి.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఏ విధంగా పెంపొందించాలి.. అనే విషయాలను చక్కగా చూపించాలని కోట వినుత వ్యాఖ్యానించారు. ఈ సినిమా తనకు బాగా నచ్చిందని పేర్కొన్నారు.

కోట వినుత చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో కనిపించడంతో చర్చ మొదలైంది. కోట వినుత మీద అభియోగాలు నమోదైన నేపథ్యంలో జనసేన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కోట వినుత విడుదలైనప్పటికీ ఎటువంటి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనడం లేదు. పైగా ఆమె బొజ్జల సుధీర్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఇప్పటికీ ఆమె ఆ ఆరోపణల మీద కట్టుబడి ఉన్నారు. మరోవైపు రాయుడు హత్య కేసు కు సంబంధించిన విచారణ ముగిసినట్టు తెలుస్తోంది. మరి దీనిపై న్యాయమూర్తి ఏ విధంగా తీర్పు ఇస్తారు.. కోట వినుత భర్త విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు.. అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. గతంలో జనసేన పార్టీ ఇన్చార్జిగా ఉన్నప్పుడు కోట వినుత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు. తనకు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకునేవారు. రాజకీయపరమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనేవారు. వాస్తవానికి ఆమె 2024లో శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఆర్థికంగా వనరులు కూడా సమకూర్చుకున్నారు. అయితే అనుకోకుండా టికెట్ సుధీర్ రెడ్డికి వెళ్లిపోవడంతో కోట వినుత ఆశల మీద నీళ్లు చలినట్టయింది. ఇప్పుడు వినూత ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.. ఆమె తన మీద వచ్చిన ఆరోపణలకు ఏ విధంగా సమాధానం చెప్తారు అనే ప్రశ్నలకు లభించిన జవాబులు ఆధారంగానే ఆమె రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper