Ravi Teja And Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటంటే వాళ్లకు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువగా గుర్తింపు ఉంటుంది. వాళ్ళ నుంచి వచ్చే సినిమాలను ప్రేక్షకులు విశేషంగా అలరిస్తుంటాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ మీదనే నడుస్తుంది. తద్వారా స్టార్ హీరోలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు సైతం వాళ్ళ సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరు స్టార్ హీరోలతోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
ఇక ఇదిలా ఉంటే రవితేజ లాంటి నటుడు సోలోగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా ఆయన ప్లాప్ లలో ఉన్నప్పటికి ఇప్పుడు ‘ఇరుముడి’ సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు.
50 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తున్న ఈయన రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్ లను సాధించడానికి సిద్ధమవుతున్నాడు. ఏది ఏమైనా కూడా ఇరుముడి సినిమాలో రవితేజ అద్భుతమైనటువంటి నటనను కనబరిచినందుకుగాను మెగాస్టార్ చిరంజీవి తనను పర్సనల్ గా పిలిచి అభినందించారట. ఈ విషయాన్ని సినిమా యూనిట్స్ సైతం తెలియజేస్తూ ఉండడం విశేషం…
చిరంజీవి రవితేజతో చాలాసేపు మాట్లాడాడట అలాగే సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ మీద చిరంజీవికి కోపం వచ్చిందట. కొన్ని సందర్భాల్లో తను బాగా తాగుతూ ఉండటం వల్ల చిరంజీవి వీడు ఇలా ఎందుకు తాగుతున్నాడు కూతురు అంటే ఇష్టం ఉంది కానీ వాడు వ్యసనానికి అలవాటు పడిపోయాడు ఆ మందు గనక మానేస్తే వీడిని మించిన క్యారెక్టర్ మరొకటి ఉండదు అని అనుకున్నారట.
అదే సందర్భంలోనే తన కూతురు చెప్పిన మాట వల్ల ఆ సినిమాలో మందు మానేయడంతో సినిమా ఆసక్తికరంగా మారిందని సినిమా మీద హైప్ పెరగడమే కాకుండా సినిమాని చూస్తున్నంత సేపు నాకు కూడా ఒక మంచి బుస్టాప్ వచ్చిందని చిరంజీవి చెప్పడం విశేషం… ఇక రీసెంట్ గా అంటే చిరంజీవి బర్త్ డే సందర్భంగా సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ అతనికి బర్త్ డే విషెష్ తెలియజేయడం విశేషం…