Homeజాతీయ వార్తలుBJP: బిజెపికి ఇది గట్టి హెచ్చరిక!

BJP: బిజెపికి ఇది గట్టి హెచ్చరిక!

BJP: దేశ రాజకీయాల్లో కీలక పరిణామం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ పరంగా బిజెపి బలంగా ఉంది కానీ.. ఆ పార్టీ ఒంటరి బలం మాత్రం తగ్గుతోంది. ఇది హెచ్చరిక లాంటిది. ఆరు నెలల కిందట ఇండియా టుడే – సి ఓటర్ నిర్వహించిన నేషన్ మూడ్ లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ బలమైన శక్తిగా ఉండేది. కానీ తాజాగా నిర్వహించిన సర్వేలో బిజెపి బలం తగ్గింది. ఎన్డీఏ పరంగా […]

BJP: దేశ రాజకీయాల్లో కీలక పరిణామం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్డీఏ పరంగా బిజెపి బలంగా ఉంది కానీ.. ఆ పార్టీ ఒంటరి బలం మాత్రం తగ్గుతోంది. ఇది హెచ్చరిక లాంటిది. ఆరు నెలల కిందట ఇండియా టుడే – సి ఓటర్ నిర్వహించిన నేషన్ మూడ్ లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ బలమైన శక్తిగా ఉండేది. కానీ తాజాగా నిర్వహించిన సర్వేలో బిజెపి బలం తగ్గింది. ఎన్డీఏ పరంగా ఇంకా స్థిరంగా కొనసాగుతోంది బలమైన నాయకత్వం. అయితే కాంగ్రెస్ లో స్వల్ప మార్పు. ఆ పార్టీ జాతీయ స్థాయిలో పుంజుకున్నట్లు ఈ సర్వే తేల్చింది. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో బిజెపికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఈ సర్వే తేల్చింది. ఒక విధంగా భారతీయ జనతా పార్టీకి ఇది హెచ్చరిక లాంటిది. గత ఆరు నెలలుగా జరిగిన పరిణామాలతోనే జాతీయస్థాయిలో బిజెపి ప్రభావం తగ్గుతోంది అని స్పష్టం అవుతుంది.

* తగ్గిన బిజెపి బలం..
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఏంటి అని ప్రజల మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇండియా టుడే- సి ఓటర్. అయితే జాతీయస్థాయిలో అధికారంలోకి రావడానికి అవసరమైన 272 ఎంపీ సీట్లు బిజెపి ఒంటరిగా చేరుకునే అవకాశం లేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా 106 సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్డీఏ పరంగా అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజారిటీ సొంతం అయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఈ ఆరు నెలల కాలంలో బిజెపితో పాటు ఎన్డీఏ 26 ఎంపీ స్థానాలు తగ్గిపోవడం మాత్రం ఆందోళన కలిగించే విషయం. భారతీయ జనతా పార్టీకి ఇది ఒక హెచ్చరిక లాంటిది. అయితే ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపితో పాటు ఎన్డీఏ బలం స్థిరంగా ఉండడం ఉపసమనం కలిగించే విషయం.

* ఉత్తరాది రాష్ట్రాల్లో..
ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాలుగా ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లలో బలం తగ్గిన సూచనలు కనిపిస్తున్నాయి బిజెపికి. ఇటీవల జెన్ జి ఉద్యమాలు, ప్రశ్న పత్రాల లీకేజీల వంటి అంశాలు ఆ పార్టీకి మైనస్ గా మారినట్లు అర్థమవుతోంది. వరుసగా మూడుసార్లు అధికారంలోకి రావడంతో ప్రజా వ్యతిరేకత ప్రారంభమైనట్లు స్పష్టం అవుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో చిన్న సానుభూతి ప్రారంభమైనట్లు తెలుస్తోంది ఈ సర్వే ద్వారా. అదే జరిగితే బిజెపి జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఉన్నది మూడు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వానికి. కచ్చితంగా సుస్థిర పాలనతో పాటు ఎటువంటి వ్యతిరేకత తరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. లేకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీకి చాలా కష్టం అని ఈ సర్వే ద్వారా తేలింది. చూడాలి ఈ సర్వే ఫలితాలు ఎంత ప్రభావం చూపబోతున్నాయో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper