Irumudi Movie: కొన్ని సినిమాలు కొంతమంది జాతకాలను మార్చేస్తుంటాయి. గొప్ప టాలెంట్ ఉన్నప్పటికీ , సరైన అవకాశాలు రావు. ఒకే ఒక్క అవకాశం ఇస్తే చాలు , మేమంటే ఏంటో చూపిస్తాము అనే కసితో ఉంటారు సినిమాల మీద పిచ్చి తో ఇండస్ట్రీ కి వచ్చిన ఎంతో మంది టాలెంటెడ్ నటీనటులు. కానీ అదృష్టం కలిసిరాక ఒక పాయింట్ దగ్గరే ఆగిపోతుంటారు. కొంతమంది అయితే , అది కూడా లేదు, అవకాశాల కోసం ప్రయత్నం చేసి అలిసిపోయి , కృష్ణా నగర్ లోనే సినిమా మీద పిచ్చి తో , ఎదో ఒక విభాగం లో చాలీచాలని జీతం తో జీవితం గడుపుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్లకు ‘జబర్దస్త్’ కామెడీ షో, ఒక గొప్ప వేదిక గా మారింది. ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులకు జీవితాలను అందించింది. అలాంటి ఆర్టిస్టులలో ఒకరు కొమురక్క. రీసెంట్ గా ఇతను ‘ఇరుముడి’ చిత్రం లో నాగులు అనే క్యారెక్టర్ చేశాడు.
ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ప్రేక్షకులు ఈ ‘నాగులు’ క్యారెక్టర్ ని గుర్తించుకున్నారు. సుమారుగా 18 ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో ఉంటున్న ‘కొమురక్క’ కి రానటువంటి గుర్తింపు , ఈ సినిమాతో వచ్చింది. ఇతని అసలు పేరు ‘కొమరం’. అయితే నిన్న మేకర్స్ ‘ఇరుముడి’ చిత్రం సక్సెస్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు, ఈ ఈవెంట్ లో పాల్గొన్న కొమరం, చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘లేడీ గెటప్ వేసుకునే నన్ను డైరెక్టర్ శివ గారు ఒక రోజు పిలవగానే ఎదో ట్రాన్స్ జెండర్ క్యారెక్టర్ కోసం పిలిచి ఉంటారని అనుకున్నాను కానీ, రెడ్ చొక్కా ఇచ్చి , గెటప్ వేసి, రవితేజ సార్ కాలర్ పట్టుకొని కొట్టమని చెప్పగానే, నాకు ప్యాక్ అయ్యింది. నావల్ల కాలేదు సార్. ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్న అద్భుతమైన గుర్తింపు నాకు ఈ సినిమాతో వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు కొమరం. ఇకపోతే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం తో , కొమరం కి రీసెంట్ గానే ఒక పాన్ వరల్డ్ మూవీ లో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది అట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.