Homeఎంటర్టైన్మెంట్Irumudi Movie : 'ఇరుముడి' మూవీ చూసిన పవన్ కళ్యాణ్... రవితేజ కి ఫోన్ చేసి...

Irumudi Movie : ‘ఇరుముడి’ మూవీ చూసిన పవన్ కళ్యాణ్… రవితేజ కి ఫోన్ చేసి ఆ రెండు విషయాల మీద మాట్లాడడా…

Irumudi Movie : రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఏది ఏమైనా కూడా గత 10 సంవత్సరాలుగా రవితేజ కెరియర్ లో ఇలాంటి సినిమా రాలేదనేది వాస్తవం… మొత్తానికైతే రవితేజ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి సైతం బాగా దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాలో కూతురు సెంటిమెంట్ బాగా […]

Irumudi Movie : రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఏది ఏమైనా కూడా గత 10 సంవత్సరాలుగా రవితేజ కెరియర్ లో ఇలాంటి సినిమా రాలేదనేది వాస్తవం… మొత్తానికైతే రవితేజ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి సైతం బాగా దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఈ సినిమాలో కూతురు సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. కాబట్టి ప్రతి ఒక్క అభిమాని రవితేజ ని చూస్తూ చాలా గర్వపడుతున్నాడు. ఇలాంటి క్యారెక్టర్ రవితేజ చేస్తే చూడాలని చాలా సంవత్సరాల నుంచి అతని అభిమానులైతే ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు రవితేజకు సరైన క్యారెక్టర్ పడిందని ఫ్యాన్స్ రిపీటెడ్ గా ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు… ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఈ సినిమాని చూసి రవితేజను మెచ్చుకుంటున్నారు.

ఇలాంటి క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఈ సినిమాని చూశారట. ఇందులో ఒక మంచి మెసేజ్ ఉందని అది చాలా వరకు జనానికి రీచ్ అయ్యిందని తద్వారా వాళ్లు కూడా దీన్ని అనుసరిస్తూ వాళ్ల పిల్లల్ని ఎలా పెంచాలి అనేది తెలుసుకుంటే మంచిదని ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాడు…

ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ ఈ సినిమాని చూడడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఆయన ఏ సినిమాను చూడడం లేదు. ఇందులో సోషల్ మెసేజ్ ఉందనే ఉద్దేశ్యంతోనే ఆయన చూస్తే బాగుంటుందని సినిమా యూనిట్ అడగడంతో ఆయన ఈ సినిమాని చూసినట్టుగా తెలుస్తుంది.

రవితేజ యాక్టింగ్ అద్భుతంగా ఉందని చెప్పడమే కాకుండా ఈ సినిమాలో కంటెంట్ కూడా బాగుందని పవన్ కళ్యాణ్ తనే స్వయంగా రవితేజ కి ఫోన్ చేసి మాట్లాడాడట. ఇక మీదట కూడా రవితేజ ఇలాంటి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తే బాగుంటుందని అతని అభిమానులు కోరుకుంటున్నారు…

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper