Irumudi Vs Toxic: రవితేజ హీరోగా ‘శివ నిర్వాణ’ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా గత వారం రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఈ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇకమీదట రవితేజ నుంచి ఇలాంటి సినిమాలు వస్తే చూడడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ సగటు ప్రేక్షకులు చెబుతుండటం విశేషం… మొత్తానికైతే రవితేజ కంబ్యాక్ ఇవ్వడం ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఆనందాన్నిస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఈరోజు టాక్సిక్ సినిమాని ఇరుముడి మూవీ కి పోటీగా దింపారు… మొత్తానికైతే టాక్సిక్ సినిమా అనుకున్న రేంజ్ లో లేదు అనే టాక్ వినిపిస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా టాక్సిక్ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకోవాలని చూసిన యశ్ కి కొంతవరకు నిరాశ ఎదురైందని చెబుతున్నారు. ఇక మొత్తానికైతే ఇరుముడి సినిమా ధాటికి టాక్సిక్ నిలబడలేదు. మరో వారం రోజులపాటు ఇరుముడి దే హవా కొనసాగబోతుంది అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికి టాక్సిక్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ కేటాయించారు కాబట్టి రెండు రోజుల తర్వాత టాక్సిక్ ను ఆ థియేటర్ల నుంచి తీసేసి ఆ థియేటర్లను సైతం ఇరుముడికి కేటాయించే అవకాశాలైతే ఉన్నాయంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా రవితేజ హీరోగా వచ్చిన ఇరుముడి సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను సంపాదించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… మొత్తానికైతే తే రవితేజ చాలా రోజుల తర్వాత భారీ సక్సెస్ ని సాధించి మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చాడు. రాబోయే సినిమాతో మరింత ముందుకు దూసుకెళ్లి ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ లను సాధించాలనే దృక్పథంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.
లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ ని రాబడుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది… రవితేజ నెక్స్ట్ మూవీ దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్నాడు. ఈ సినిమాని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు…