Raksha Bandhan Wishes: అన్నా చెల్లెళ్ల అనుబంధానికి నిలిచే రాఖీ పండుగను ఆగష్టు 28న ఘనంగా నిర్వహించుకోనున్నారు. ఈ సందర్భంగా సోదరీమణులు.. తమ సోదరుల వద్దకు వచ్చి రాఖీ కట్టడం ఆనవాయితీ. కానీ చాలా మంది దూర ప్రాంతాల్లో ఉన్నారు. దీంతో కొందరు ఆన్ లైన్ లో రాఖీలు పంపించి తన అనుబంధాన్ని చాటుకుంటున్నారు. ఇదే సమయంలో కొందరు రాఖీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే సాధారణంగా కాకుండా మంచి కొటేషన్ తో రాఖీ విషెష్ చెప్పడం వల్ల ఎదుటివారిని ఆకట్టుకున్నవారవుతారు. ఈ కింద ఉన్న కొటేషన్స్ తో రాఖీ విషెష్ చెబితే ఎదుటివారిని ఆకట్టుకున్నవారవుతారు.
జీవితాంతం మన అనుబంధం ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. ప్రేమతో, ఆప్యాయతో రాఖీ శుభాకాంక్షలు.
అన్నయ్య.. నీ జీవితంలో ప్రతిరోజూ పండుగ వాతావరణం కలగాలని.. నిత్యం నీవు ఆనందంతో ఉండాలని కోరుకుంటూ హ్యాపీ రక్షాబంధన్..
రాఖీ పండుగ అంటే కేవలం చేతికి దారం కట్టడం మాత్రమే కాదు.. జీవితాంతం నీకు నేను తోడుగా.. ఉంటూ.. నాకు నువ్వు తోడు ఉండాలని కోరుకుంటూ రక్షాబంధన్ శుభాకాంక్షలు.
నీవు నాకు అన్నయ్యవు అయినందుకు నేనెంతో అదృష్టవంతురాలిని.. మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ.. రాఖీ పండుగ శుభాకాంక్షలు.
నీ జీవితంలో ఎప్పటికీ చిరునవ్వు ఉండాలని.. నీవు కన్న ప్రతీ కల నెరవేరాలని కోరుకుంటూ.. హ్యపీ రక్షాబంధన్..
మన చిన్నప్పటి జీవితంలో కలిసున్న గుర్తులు.. అనుబంధం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ రక్షాబంధన్ శుభాకాంక్షలు.
మనం దూరం ఉన్నా.. మన మనసులు ఒక్కటే.. మన బంధానికి దూరం అడ్డు కాదు.. నీ జీవితంలో ఎప్పటికీ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ.. రక్షాబంధన్ శుభాకాంక్షలు.
ఈ సృష్టిలో అన్నా చెల్లెళ్ల బంధం.. ఎంతో అందమైనది.. ఈ బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ రక్షా బంధన్..
అన్నయ్య.. నీవు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటూ.. అన్నింట్లో సక్సెస్ కావాలని కోరుకుంటూ రాఖీ పండుగ శుభాకాంక్షలు.
మన చిన్నప్పటి సంగతులు గుర్తుకు వచ్చి నేనెంతో సంతోషిస్తున్నా.. మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ.. హ్యాపీ రక్షాబంధన్..