Irumudi child artist: రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే దిశగా ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రవితేజ మరోసారి కంబ్యాక్ ఇచ్చాడు అంటూ అతని అభిమానులు ఆనందపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో రవితేజ కూతురిగా నటించిన నక్షత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెబుతూ దర్శకుడు శివ నిర్వాణ ఎమోషనల్ అయ్యాడు. నక్షత్ర కి తెలుగు అంత పర్ఫెక్ట్ గా రాకపోయినా కూడా ఆమె పర్ఫెక్ట్ డైలాగ్స్ నేర్చుకొని యాక్టింగ్ చేసిందంటూ ఆయన మాట్లాడాడు. అలాగే ఒక ఫాదర్ డాటర్ మధ్య ఉండే ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తను చాలా బాగా నటించిందని చెప్పాడు.
ఇక దానికి తోడుగా మొదటి రోజు షూట్ అయిపోయిన తర్వాత ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు శివ నిర్వాణ నక్షత్ర ను తన పక్కన కూర్చోబెట్టుకొని సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తండ్రీ కూతుర్ల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఎలా ఉండాలి.అందులో నువ్వు ఎలా నటించాలి అనేది చెప్పే ప్రయత్నం చేశారట. అప్పుడు శివ నిర్వాణ మాట్లాడుతూ నువ్వు నిజంగా మీ ఫాదర్ని ఇమేజింగ్ చేసుకో అని చెప్పారట. దానికి నక్షత్ర డల్ అయిపోయి నాకు మా ఫాదర్ లేడు అని చెప్పారట.
దాంతో శివ కి చాలా వరకు బాధ అనిపించిన కూడా సెట్ లో తన బాధని చూపిస్తే ఆ అమ్మాయి యాక్టింగ్ చేయాలని మనసులో దాచుకొని సక్సెస్ మీట్ లో చెబుతున్నాను అంటూ ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. అలాగే నక్షత్ర వల్ల మదర్ ను పులి తో పోలుస్తూ ఆమె చాలా ధైర్యవంతురాలు అంటూ ఆయన మాట్లాడిన మాటలు అందరిని ఆకట్టుకున్నాయి. నిజానికి నక్షత్ర ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. రవితేజ కి ఆమెకి మధ్య చాలా మంచి ఎమోషనల్ బాండింగ్ కుదిరింది.
అందువల్లే ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడికి నచ్చింది అంటూ సోషల్ మీడియాలో చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని రాబడుతుందనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…