Kodali Nani Legal Issues: కొడాలి నాని( Kodali Nani ) వంతు వచ్చిందా? ఆయనకు షాక్ ట్రీట్మెంట్ తప్పదా? కేసులతో కూటమి ఉక్కిరి బిక్కిరి చేయనుందా? ఇది జస్ట్ శాంపిల్స్ మాత్రమేనా? ఆయనపై చాలా రకాల అస్త్రాలు ఉన్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా విశాఖపట్నం పోలీసులు కొడాలి నాని కి నోటీసులు జారీ చేశారు. అయితే అది చాలా చిన్న కేసు. అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. కానీ అంతకుమించి కొడాలి నాని పై గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. భారీగా కేసులు నమోదు చేసి.. వల్లభనేని వంశీ మోహన్ కు మించి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనారోగ్యం నుంచి కుదురుకున్నారు కొడాలి నాని. తనలో ఉన్న పాత వాసనలను తెరపైకి తెస్తున్నారు. అదిగో కొడాలి నాని వస్తున్నాడు అంటూ పేర్ని నాని లాంటివారు హీరోయిజం ప్రదర్శిస్తున్నారు. దీంతో కొడాలి నాని విషయంలో ఉపేక్షిస్తే అసలు వస్తుందని కూటమి భావిస్తున్నట్లు సమాచారం. అసలు బయటకు వచ్చే వీలు లేకుండా కేసుల మీద కేసులు నమోదు చేసుకునేందుకు అంతా కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది.
Also Read: వై నాట్ పులివెందుల.. ఓడిపోతే వైసీపీకి కష్టమే!
వెనక్కి తగ్గినట్లు కనిపించినా..
కూటమి( alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని అని అంతా భావించారు. వల్లభనేని వంశీ మోహన్ కంటే ముందే కొడాలి నాని అరెస్టు ఉంటుందని అంచనా వేశారు. కొడాలి నానిని అరెస్టు చేయాలని సగటు కూటమి అభిమాని కోరుకున్నారు. అంతలా విసిగించారు.. వేధించారు కొడాలి నాని. అయితే ఎందుకో కొడాలి నాని విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కనిపించింది. అయితే దాని వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. పక్కా ఆధారాలతో.. కనీసం తప్పించుకోలేని స్థితిలో కొడాలి నానిని పెట్టి.. పట్టు బిగించాలన్నది కూటమి వ్యూహం. అయితే అనారోగ్యం పేరుతో తాత్కాలిక ఉపశమనం పొందారు కొడాలి నాని. కానీ ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడడంతో అసలు సినిమా ప్రారంభం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
చాలా రకాల కేసులకు అవకాశం..
కొడాలి నాని చాలా దూకుడుగా ఉండేవారు. ఆయన మంత్రిగా ఉండేటప్పుడు గుడివాడలో( Gudivada ) కె సినో, జూదం శిబిరాలు నిర్వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో నిజనిర్ధారణకు వెళ్లిన టిడిపి నేతలను తరిమికొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పటి టిడిపి ఇన్చార్జ్ రావి వెంకటేశ్వరరావు దుకాణం పై దాడి చేసిన సందర్భం కూడా ఉంది. మట్టితో పాటు ఇసుక మాఫియా సైతం అప్పుడు రాజ్యమేలినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎంతోమంది భూముల కబ్జాలకు గురయ్యాయి. ఆపై దూకుడు ప్రవర్తనతో ప్రత్యర్థులు ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇన్ని రకాలుగా కొడాలి నాని పై కేసులు నమోదు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎందుకో కూటమి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కొడాలి నాని విషయంలో ముందుకు వెళ్లలేదు. ముఖ్యంగా సామాజిక వర్గం అడ్డం పడిందన్న టాక్ వినిపించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఒక వ్యూహం ప్రకారం కొడాలి నాని విషయంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: ఏపీలో మందుబాబులకు మరింత కిక్..!
పక్కా ఆధారాలు సేకరణ..
కొడాలి నాని అరెస్టు జరుగుతుందన్న క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు స్టంట్ లు వేశారు. ప్యాడ్స్ తో కనిపించారు. ఇటువంటి సమయంలో అరెస్టు చేస్తే కచ్చితంగా సింపతి వర్కౌట్ అవుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే అంశంగా మారుతుంది. అందుకే గత ఏడాదిగా కొడాలి నాని అక్రమాల వెనుక బలమైన ఆధారాలు సేకరించగలిగింది కూటమి ప్రభుత్వం. అందుకే ఇప్పుడు విశాఖలో చిన్న కేసును నమోదు చేయడం ద్వారా గట్టి సంకేతాలు ఇవ్వగలిగింది. తప్పకుండా కొడాలి నాని అరెస్టు ఉంటుందని స్పష్టమవుతోంది. అయితే వల్లభనేని వంశీ మోహన్ కు మించి ట్రీట్మెంట్ ఉంటుందని మాత్రం తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?