Vijayasai Reddy: సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి పెద్దపెద్ద ప్రకటనలు చేస్తున్నారు. ఓ రేంజ్ లో తనను తాను ఊహించుకుని ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారు. తన పొలిటికల్ ఎంట్రీ పై రోజుకో రకంగా ప్రకటనలు చేస్తూ హైలెట్ అవుతున్నారు. అయితే ఆయన చేస్తున్న ప్రకటనలు కొంచెం అతిగా ఉంటున్నాయి. తనపై ఎవరూ ఒత్తిడి చేయలేరని.. తనకంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉందని.. ఒక రకమైన ఆలోచనతోనే మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాను అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. అదిగో పొలిటికల్ ఎంట్రీ.. ఇదిగో పొలిటికల్ ఎంట్రీ అంటూ విజయసాయిరెడ్డి చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. గత ఏడాది కాలంగా ఇదే సందడి ఆయన నుంచి. ఆయన కోసం ఏదో రాజకీయ పార్టీలు క్యూ కడుతున్నట్టు.. తమ పార్టీలో చేరాలని ఒత్తిడి పెంచుతున్నట్టు అన్నట్టు ఉంది ఆయన వ్యవహార శైలి.
* ఏడాదిన్నర కిందట గుడ్ బై..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఏడాదిన్నర కిందట విజయసాయిరెడ్డి. పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇకనుంచి రాజకీయాలు చేయనని.. అసలు రాజకీయాల కోసం మాట్లాడనని ఏవేవో మాటలు చెప్పారు. కానీ వారం రోజులు కూడా ఉండలేకపోయారు. రాజకీయ పార్టీల నేతలను కలిశారు. పొలిటికల్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. అక్కడకు కొద్ది రోజులకే మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తానని.. క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్తానని తేల్చి చెప్పారు. అంతకుముందు మీడియాను ఏర్పాటు చేస్తానని.. కొలిక్కి వచ్చాక పొలిటికల్ రీయంట్రి ఉంటుందని గట్టిగానే చెప్పారు. ప్రస్తుతం మీడియా ఏర్పాటు అనేది ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు కూడా అదిగో ఇదిగో అంటూ దాటవేసే ధోరణితో ఉన్నారు.
* ఉన్న ఆప్షన్ వైసిపి..
విజయసాయి రెడ్డికి ఉన్న ఏకైక ఆప్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే విజయసాయిరెడ్డి రీఎంట్రీ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈయన ప్లేసులో ఉన్న సజ్జల చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీలో రీఎంట్రీ కి అవే సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ విజయసాయిరెడ్డి మాత్రం విలువల గురించి మాట్లాడుతున్నారు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని.. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటానని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు. నేరుగా వైసీపీలోకి వెళ్తే అడ్డుకునేది ఎవరు? అడ్డగించేది ఎవరు? కానీ అలా కాదు. పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ పొలిటికల్ గా ఏవేవో ఊహాగానాలు రేగేలా ఆయన వ్యవహార శైలి ఉంది. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా. ఇంత ప్రకటనల కంటే.. నేరుగా వైసీపీలో చేరిపోవచ్చు కదా అని సెటైర్లు పడుతున్నాయి.