Pawan Kalyan Strategy: అసలు రాజకీయాల్లో పవన్( deputy CM Pawan Kalyan) వ్యూహం ఏంటి? జనసేన పార్టీని ఎలా తీర్చిదిద్దుతారు? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. పవన్ కు రెండు రకాల అభిమానులు ఉన్నారు. సినీ పరంగా అభిమానించేవారు.. రాజకీయపరంగా అభిమానించేవారు. సినిమా అభిమానుల దారులు వేరువేరుగా ఉంటాయి. కానీ రాజకీయపరంగా అభిమానించే వారు మాత్రం ప్రత్యేకం. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మార్పు కోరుకునేవారు పవన్ వెంట నిలిచారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా పరంగా అభిమానించే మెజారిటీ అభిమానులు కూడా ఆయన వెంట ఉన్నారు. అయితే అందరి కోరిక ఒకటే. పవన్ కళ్యాణ్ ను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడాలన్నది వారి బలమైన కోరిక. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వేరే వ్యూహంలో ఉన్నారు. కూటమి కట్టడంలో కీలక పాత్ర పోషించారు. కూటమి అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యారు. అయితే ఆయన మాత్రం కూటమి మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంపై పూర్తిస్థాయి నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఆయనకు వ్యూహం ఉండొచ్చు కానీ.. ఆయనను అభిమానించి.. సీఎంగా చూడాలనుకున్న వారు మాత్రం బాధపడుతున్నారు. అధినేత తీరు తెలియక.. ఆయన మనసులో ఉన్న వ్యూహం తెలియక సతమతం అవుతున్నారు.
Also Read: కూటమి పక్కా ప్లాన్.. ఇక జైల్లోనే కొడాలి నాని?!
బలమైన కులం అండగా..
తాను కులం చూడనని పవన్ కళ్యాణ్ చెబుతుంటారు. ఆయన వరకు అది వాస్తవం అయినా.. బలమైన కాపు సామాజిక వర్గం మాత్రం పవన్ కళ్యాణ్ ను తమ వాడిగా చూసుకుంటోంది. తమ నుంచి రాజ్యాధికారం దక్కించుకున్న నేతగా గుర్తించుకుంది. ముఖ్యమంత్రి అనే పదవికి కూత వేటు దూరంలో ఉన్న పవన్ కళ్యాణ్.. ఎప్పటికైనా ఆ స్థానానికి చేరుకుంటారని ఆశిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ కు ఆ సామాజిక వర్గం గట్టి మద్దతుదారుగా నిలిచింది. వాస్తవానికి కాపు సామాజిక వర్గం( Kapu community) రాజ్యాధికారం కోసం దశాబ్దాలుగా వేచి చూస్తూ వస్తోంది. మొదట వంగవీటి మోహన్ రంగా రూపంలో సరైన నాయకత్వం లభించిందని భావించింది. కానీ ఆయన హత్యకు గురయ్యారు. అకాల మరణం చెందారు. తరువాత ముద్రగడ తెరపైకి వచ్చారు. సరైన రాజకీయ వ్యూహాలు లేక చతికిల పడ్డారు. ప్రజారాజ్యం పార్టీ రూపంలో చిరంజీవి వచ్చారు. త్రిముఖ పోటీలో రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల ఓట్లు సొంతం చేసుకున్నారు. కానీ పార్టీని నిలబెట్టుకోలేకపోయారు. అయితే వీరంతా వ్యూహం లేక చతికిల పడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయలేదు.
గుణపాఠాలుగా మార్చుకుని
2014లో జనసేనను( janasena ) ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. కానీ అప్పటికే ప్రజారాజ్యం పార్టీ రూపంలో ఒక ఫెయిల్యూర్ ఆ కుటుంబం ముందు ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ ని చాలా తేలిగ్గా తీసుకున్నారు అభిమానులు. కాపు సామాజిక వర్గం సైతం అదే అభిప్రాయంతో ఉండేది. 2014లో వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు పవన్. ఆ ప్రభావం 2019 ఎన్నికలపై పడింది. వామపక్షాలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు పవన్ కళ్యాణ్. అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం సైతం నమ్మలేకుండా పోయింది. అందుకే 2019 ఎన్నికల్లో కనీస స్థాయిలో కూడా జనసేన పోటీ ఇవ్వలేకపోయింది. కానీ అదే నమ్మకంతో పార్టీని నడిపారు పవన్ కళ్యాణ్. అయితే అసలు సిసలైన పవన్ వ్యూహం అక్కడే ఉంది. సుదీర్ఘకాలం ఎన్నో కష్టాలు పడి పార్టీని నడిపారు. ఇతర పార్టీల మాదిరిగా ఒకేసారి ఉవ్వెత్తున ఎగసిపడలేదు. కొంచెం కొంచెం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగారు. అందుకే తనకున్న బలాన్ని అంచనా వేసుకుని తక్కువ స్థానాలతో.. శత శాతం విజయాన్ని సాధించారు.
Also Read: ఏపీలో మందుబాబులకు మరింత కిక్..!
తప్పకుండా ఆ ఆలోచన..
అయితే ఒక రాజకీయ పార్టీ నేతగా పవన్ కళ్యాణ్ కు ఒక వ్యూహం అంటూ ఉంటుంది. ముఖ్యమంత్రి( chief minister) పదవికి కూత వేటు దూరంలో ప్రస్తుతం ఉన్నారు పవన్ కళ్యాణ్. కచ్చితంగా ఆయనకు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఉంటుంది. అందుకు ప్రయత్నాలు చేస్తారు కూడా. ప్రస్తుతం ఆయన అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గానికి అదే నమ్మకం. తద్వారా తమ అభిమాన నేత, ఆరాధించే నాయకుడు ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవి చేపడుతారని వారు ఎంతో నమ్మకంతో ఉన్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సైతం వృత్తి తో పాటు ప్రవృత్తిని కొనసాగిస్తున్నారు. తద్వారా తన ఇమేజ్ను అంతకంతకు పెంచుకుంటున్నారు. అయితే పవన్ వ్యూహం ఎవరికి అంతుపట్టడం లేదు. కానీ అభిమానులు మాత్రం అదే స్థాయి నమ్మకంతో ఉన్నారు. కాపు సామాజిక వర్గం సైతం ఆయనపై చాలా నమ్మకంతో ఉంది. చూడాలి పవన్ ఏ స్థాయికి చేరుకుంటారో..