HomeతెలంగాణHyderabad Traffic Problem: హైదరాబాద్‌ వాసుల కష్టాలు తీరబోతున్నాయి

Hyderabad Traffic Problem: హైదరాబాద్‌ వాసుల కష్టాలు తీరబోతున్నాయి

Hyderabad Traffic Problem: విశ్వనగరం హైదరాబాద్‌లో అతిపెద్ద సమస్య ట్రాఫిక్‌.. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నగర వాసులు నరకం అనుభవిస్తున్నారు. చిన్నపాటి వర్షం పడినా కిలోమీటర్లకొద్ది ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. గంటలకొద్ది రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి. ఈ సమస్య పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వాలు ఫ్లై ఓవర్లు నిర్మస్తున్నాయి. మెట్రో విస్తరణకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కానీ సమస్యకు శాశ్వత పరిష్కారం కావడం లేదు. ఈ క్రమంలో తాజాగా కేబీఆర్‌ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మాణం చేపట్టాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) సన్నాహాలు చేస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌లు పార్కు ఈకో సెన్సిటివ్‌ జోన్‌ (ఈఎస్‌జెడ్‌)పై ప్రభావం చూపే అవకాశం, చెట్ల తొలగింపు అంశంపై జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు సరికొత్త డిజైన్లతో పనులు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది.

Also Read:  రేవంత్ ఆఫర్ : జూబ్లీహిల్స్ క్యాండిడేట్ ను డిసైడ్ చేసేది చిరంజీవినే

పార్కు చుట్టూ అభివృద్ధి ప్రణాళికలు..
కేబీఆర్‌ పార్కు చుట్టూ ఆరు కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు పైవంతెనలు, అండర్‌ పాస్‌ల నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం 307 ఆస్తుల సేకరణ అవసరమని, ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. ఈ అభివృద్ధి పనులు నగరంలో రవాణా సౌలభ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఉన్నప్పటికీ, పర్యావరణ ప్రభావంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం రూపొందించిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఆర్‌డీపీ) డిజైన్లు ఈఎస్‌జెడ్‌ను దెబ్బతీసే అవకాశం ఉండటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త డిజైన్లను రూపొందించింది.

పర్యావరణ సమస్యలు..
కొత్త డిజైన్ల ప్రకారం, పైవంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణం కోసం 1,942 చెట్లను తొలగించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ చెట్లలో సగం వృక్షాలను వేరే ప్రాంతాల్లో తిరిగి నాటే ప్రణాళిక ఉన్నట్లు ముఖ్య ఇంజినీరు భాస్కర్‌రెడ్డి తెలిపారు. అయినప్పటికీ, ఈ పెద్ద ఎత్తున చెట్ల తొలగింపు కేబీఆర్‌ పార్కు యొక్క జీవవైవిధ్యంపై, స్థానిక వాతావరణంపై గణనీయమైన ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. పార్కు చుట్టూ ఉన్న ఈఎస్‌జెడ్‌ హైదరాబాద్‌లో పర్యావరణ సమతులతకు కీలకమైన ప్రాంతంగా ఉంది. చెట్ల తొలగింపు, నిర్మాణ పనుల వల్ల గాలి కాలుష్యం, ఉష్ణోగ్రత పెరుగుదల వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

Also Read: మంత్రిగారి ఫోన్ పోయింది.. చివరికి ఎక్కడ దొరికిందంటే..

ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదన..
కంటోన్‌మెంట్‌ నియోజకవర్గంలో ఏఓసీ (ఆర్మీ ఆర్డినెన్స్‌ కార్ప్స్‌) రోడ్లు తరచూ రక్షణ శాఖ మూసివేస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 6 కి.మీ. పొడవైన ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఈ కారిడార్‌ పూర్తయితే, మల్కాజ్‌గిరి–సికింద్రాబాద్‌ మధ్య రాకపోకలు ఏఓసీ రోడ్లపై ఆధారపడకుండా సాగనున్నాయి. మొత్తంగా ఈ ప్రాజెక్ట్‌లు ట్రాఫిక్‌ సమస్యను చాలా వరకు పరిష్కరిస్తాయని అంచనా. అయితే నిర్మాణం పూర్తయ్యే వరకూ సమస్య మరింత ఇబ్బందిగా మారుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular