spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP Party : పేక మేడలాగా కూలిపోతున్న వైసీపీ పార్టీ..ఈరోజు విజయ్ సాయి రెడ్డి..త్వరలో పెద్ది...

YCP Party : పేక మేడలాగా కూలిపోతున్న వైసీపీ పార్టీ..ఈరోజు విజయ్ సాయి రెడ్డి..త్వరలో పెద్ది రెడ్డి..లిస్ట్ లో మరో ముగ్గురు కీలక నేతలు!

YCP Party :  2019 ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ దేశంలోనే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీలలో ఒకటి. సీఎం జగన్ దేశం లోనే మోస్ట్ పవర్ ఫుల్ నాయకుడు. పార్టీ 3 దశాబ్దాల పాటు అధికారం లో ఉంటుందని అందరూ బలంగా నమ్మారు. కానీ ఆ నమ్మకాన్ని ఒకే ఒక్క ఎన్నిక నీరుగార్చేసింది. 151 స్థానాల్లో గెలిచిన వైసీపీ పార్టీ, కేవలం గత ఎన్నికలలో 11 స్థానాలకు పడిపోయింది. అయినప్పటికీ జగన్ పట్టుదలతో నిలబడి జనాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఆయన మీద నమ్మకం లేక, ఆ పార్టీ నాయకులు మొత్తం వెళ్లిపోతున్నారు. ఇది వరకు ఎంతో మంది వైసీపీ ముఖ్యనాయకులు ఆ పార్టీ కి రాజీనామా చేసి జనసేన పార్టీ లో చేరిన సంగతి అందరికీ తెలిసిందే. కాసేపటి క్రితమే పార్టీ స్థాపించిన రోజు నుండి నేటి వరకు జగన్ అన్ని సమయాల్లోనూ అండగా నిల్చిన విజయ్ సాయి రెడ్డి కూడా రాజీనామా చేశాడు.

ఈయన రాజీనామా చేసిన కాసేపటికే ఆళ్ళ అయోధ్యరామి రెడ్డి కూడా తన రాజీనామా ని ప్రకటించాడు. త్వరలోనే రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. ఒక్క ఎన్నిక ఆ పార్టీ క్లోజ్ అయిపోయే స్థితికి రావడం దురదృష్టకరం అనే చెప్పాలి. కేవలం వీళ్లిద్దరు మాత్రమే కాదు. వైసీపీ కి సీమలో పట్టుకొమ్మ లాగా నిలుస్తూ వచ్చిన పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, అదే విధంగా ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వంటి వారు కూడా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో బొత్స సత్యనారాయణ లేకపోతే, అసలు వైసీపీ పార్టీ నే లేదు. అలాంటి వ్యక్తి కూడా త్వరలోనే రాజీనామా చేసి జనసేన పార్టీ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సీమ నుండి కేతి రెడ్డి, అదే విధంగా నెల్లూరు నుండి అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు కూడా రాజీనామా చేయడానికి సిద్ధం గా ఉన్నారట.

పార్టీ కి ముఖ్య నాయకులుగా ఉండే ఇలాంటోళ్లే రాజీనామా చేస్తూ వెళ్ళిపోతున్నారంటే, భవిష్యత్తులో జగన్, రోజా, అంబటి రాంబాబు వంటి వారు మాత్రమే ఆ పార్టీ లో మిగిలేలా ఉన్నారు. రోజా, అంబటి వంటి వారిని ఏ పార్టీ కూడా చేర్చుకోదు, లేకపోతే వీళ్ళు కూడా వేరే పార్టీ కి జంప్ అయ్యేవారని టాక్. త్వరలోనే చిలకలూరిపేట విడదల రజిని కూడా ఆ పార్టీ కి రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. వైసీపీ పార్టీ మళ్ళీ అధికారం లోకి వస్తుందనే నమ్మకం లేకనే వీళ్లంతా ఒక్కొక్కరిగా జంప్ అవుతున్నట్టు తెలుస్తుంది. వైసీపీ పార్టీ పై ఈగ వాలినా ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యర్థులపై విరుచుకుపడే కోడలి నాని, బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి వంటి వారు కూడా సైలెంట్ గా ఉంటున్నారంటే, పార్టీ ఎలాంటి స్థాయికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper