Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ (Allu Arjun) లాంటి స్టార్ హీరో సైతం పుష్ప 2 (Pushpa 2) సినిమాతో తనకంటూ ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించి ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన పుష్ప 2 సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ప్రయత్నం అయితే చేస్తుంది. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి అల్లు అర్జున్ ని ఇండియాలోనే టాప్ హీరోల్లో ఒకరిగా మార్చింది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ సక్సెస్ అవ్వడం అనేది తెలుగు సినిమా ఖ్యాతిని కూడా పెంచిందనే చెప్పాలి. ఇక డిసెంబర్ 5 వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా 50 రోజుల పూర్తి చేసుకున్న సందర్భంలో సినిమా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. మరి ఈ పోస్టర్ ను చూస్తుంటే సినిమా రిలీజ్ కి ముందు ఫ్లాప్ చేస్తాం అంటూ మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరు ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలిపారు.
ఇక దాంతో పాటుగా మెగా ఫాన్స్ అయితే ఈ సినిమాని చూసి ఈ విజయంలో చాలా కీలక పాత్ర వహించారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్కరూ తమ సినిమా అనుకొని ఆదరించారు. కాబట్టి ఈ సినిమా ఈరోజు ఇన్ని కోట్ల కలెక్షన్స్ ను వసూలు చేసింది.
ఇక మొత్తానికైతే పుష్ప 2 సినిమా మొదట బాహుబలి (Bahubali) రికార్డును బ్రేక్ చేసింది. ఇప్పుడు దంగల్ (Dangal) రికార్డును కూడా బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఏది ఏమైనా కూడా 3 గంటల 40 నిమిషాల నిడివితో ఈ సినిమా ముందుకు సాగుతున్నప్పటికి ఇప్పటికీ కూడా కొన్నిచోట్ల హౌస్ ఫుల్ గా నడుస్తుండటం విశేషం…
ఇక ఈ సినిమాతో తన రేంజ్ ఏంటో చూపించాడు మరి తర్వాత చేసే సినిమాతో మరో భారీ సక్సెస్ ను సాధించి ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదగాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…