India Independence Day 2026 : ప్రతి ఏడాది ఆగస్టు 15 వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు ఘనంగా జరుగుతుంటాయి. ఎర్రకోట మీద దేశ ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఎగరవేస్తారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు మొదలవుతాయి. అంబరాన్ని అంటే విధంగా సాగుతూ ఉంటాయి.
1947 ఆగస్టు 15న భారతదేశ తొలి స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంది. 1948 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన మరుసటి ఏడాది రెండవ ఇండిపెండెన్స్ డే జరిగింది. 2026 ఆగస్టు 15 నాటికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ ప్రకారం మన దేశం 80వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను జరుపుకుంటుంది.
ఈసారి జరిగే స్వాతంత్ర్య వేడుకలకు యువశక్తి ఫర్ వికసిత్ భారత్ @1947 అనే నినాదాన్ని జోడించారు. వందేమాతరం గేయానికి సంబంధించిన 150 ఏళ్ల చరిత్రను కూడా స్పందించుకోబోతున్నారు. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అవుతాయి. అప్పటికి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర ముఖ్యంగా ఉందని ఈ నేపథ్యం ఘనంగా చాటి చెబుతూ ఉంటుంది. శాస్త్ర.. సాంకేతిక.. హరిత ఇంధనం.. రక్షణ రంగంలో స్వావలంబన.. ఆవిష్కరణలు వంటి వాటికి విశేషమైన ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఇక ఇదే సమయంలో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తి ఇచ్చిన జాతీయగీతం.. వందేమాతరానికి సంబంధించి 150 సంవత్సరాల ప్రస్థానాన్ని గుర్తు చేసుకోబోతున్నారు. ఇది ఈ ఏడాది వేడుకలలో ప్రత్యేకంగా నిలువబోతోంది.
ఇక నాటిన 47 ఆగస్టు 14 అర్ధరాత్రి దాటిన తర్వాత భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందింది. దాదాపు రెండు శతాబ్దాల బ్రిటిష్ వలస పరిపాలనకు భారతదేశం ముగింపు పలికింది. స్వేచ్ఛ దేశంగా అవతరించింది. భారతదేశం సాగించిన స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ.. నెహ్రూ.. పటేల్…. భగత్ సింగ్ వంటి అనేకమంది నాయకులు ముఖ్యపాత్ర పోషించారు. వారి త్యాగాలు.. చేసిన పోరాటాల వల్లే భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. నటించి 47 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. స్వాతంత్రం సాధించిన అనంతరం భారతదేశానికి తొలి ప్రధానమంత్రిగా నెహ్రూ వ్యవహరించారు. నాడు ఆయన ఎర్రకోట నుంచి జాతీయ జెండాను ఎగరవేసి.. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఏడాది స్వాతంత్ర్య వేడుకలు న్యూఢిల్లీలోని ఎర్రకోటలో ఘనంగా జరుగుతాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఎగరేస్తారు. దేశ ప్రజలను ఉద్దేశించే ప్రసంగిస్తారు. అనంతరం 21 తుపాకుల గౌరవ వందనం స్వీకరిస్తారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 15న ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో జాతీయ జెండాలు ఆవిష్కరిస్తారు. మహానీయుల త్యాగాలను స్మరించుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి 2026 ఆగస్టు 15న భారతదేశ స్వాతంత్ర్యం పొంది 79 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ.. జరుపుకునేది మాత్రం ముమ్మాటికి 80వ స్వాతంత్ర్య వేడుకలే.