spot_img
Homeఆంధ్రప్రదేశ్‌KCR And Jagan: అక్కడ కెసిఆర్.. ఇక్కడ జగన్..ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నారే!*

KCR And Jagan: అక్కడ కెసిఆర్.. ఇక్కడ జగన్..ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నారే!*

KCR And Jagan: రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు( politics) శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు అలెర్ట్ అవుతున్నాయి. విపక్ష నేతలు బయటకు రావడం ప్రారంభించారు. అధికార పార్టీతో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణలో అధికారాన్ని కోల్పోయారు కేసీఆర్. అయితే ఓటమి తర్వాత ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరు. సుమారు 14 నెలల అనంతరం ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చారు. సమీక్షలు మొదలుపెట్టారు. ఏపీలో సైతం జగన్మోహన్ రెడ్డి జనం బాట పడుతున్నారు. పార్టీ నేతల పరామర్శతో పాటు గుంటూరు మిర్చి యార్డు రైతులను పరామర్శించారు. ఉగాది నుంచి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. అయితే ఆ ఇద్దరు నేతలు ఆరు నెలల వ్యవధిలోనే అధికారాన్ని కోల్పోవడం విశేషం.

* 14 నెలల తర్వాత కెసిఆర్
వరుసగా రెండుసార్లు తెలంగాణలో( Telangana) అధికారంలోకి వచ్చారు కెసిఆర్. 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించింది కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్. 2018లో సైతం రెండోసారి అధికారంలోకి రాగలిగింది. 2023 ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 14 నెలల అనంతరం కెసిఆర్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ నేతలతో మాట్లాడారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు, ప్రభుత్వ వైఫల్యాలతో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని.. వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమని తేల్చి చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా మూడున్నర ఏళ్ల కాలం ఉంది. తప్పులు సరిదిద్దుకునేందుకు సమయం కూడా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం బలహీనం కావడం, తెలంగాణ కాంగ్రెస్ లో సైతం వర్గాలు నడుస్తుండడంతో కెసిఆర్ మరింత యాక్టివ్ అవుతున్నారు.

* ప్రజాక్షేత్రంలోకి జగన్
ఏపీలో సైతం జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)చాలా రకాలుగా యాక్టివ్ అవుతున్నారు. పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్తున్నారు. అయితే వారి స్థానంలో కొత్త నియామకాలు చేపడుతున్నారు. పార్టీ నేతలపై దాడులతో పాటు కేసులను ప్రశ్నిస్తున్నారు. ఉగాది నుంచి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2029 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని తేల్చి చెబుతున్నారు. అయితే ఇక్కడ కూడా టిడిపి కూటమికి నాలుగేళ్ల సమయం ఉంది. ఆపై అపర చాణిక్యుడు చంద్రబాబు ఉన్నారు. అంత ఈజీ కాదని తెలిసినా జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

* ప్రయత్నాలు ఫలిస్తాయా?
అయితే ఒకేసారి స్నేహితులిద్దరూ తెరపైకి రావడం చర్చకు దారితీస్తోంది. వీరిద్దరూ పరస్పర రాజకీయ ప్రయోజనాలు చేసుకున్న వారే. కానీ ఇద్దరు తమ సొంత రాష్ట్రాల్లో ఓడిపోయారు. భారీ అంచనాలతో రంగంలోకి దిగి చతికిల పడ్డారు. అయితే ఇప్పుడు ఒకేసారి ఇద్దరు క్రియాశీలకం కావడం మాత్రం చర్చకు దారితీస్తోంది. ఒక ప్రత్యేక వ్యూహంతోనే ఇద్దరు ఒకేసారి జర్నీ ప్రారంభించినట్లు అర్థమవుతోంది. చూడాలి వారి వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper