Homeఆంధ్రప్రదేశ్‌Kakinada Sowjanya family case: కొబ్బరి నీళ్లలో విషపదార్థం.. సౌజన్య కుటుంబాన్ని చిదిమేసిన ‘సాధిక్’ క్రూరత్వం...

Kakinada Sowjanya family case: కొబ్బరి నీళ్లలో విషపదార్థం.. సౌజన్య కుటుంబాన్ని చిదిమేసిన ‘సాధిక్’ క్రూరత్వం ఇదీ

Kakinada Sowjanya family case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ నగరానికి చెందిన పంచాయతీరాజ్ ఏఈ టీ నూకరాజు కుటుంబం ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. నూకరాజు.. ఆయన భార్య.. కుమార్తె సౌజన్య.. మనవడు అందరూ కలిసి గోదావరిలో దూకారు. వీరిలో సౌజన్యకుమారుడు బతికాడు. ఈ వ్యవహారంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో సాదిక్ పాత్ర బయటపడింది. సౌజన్యకు జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు. సౌజన్య తన కుమారుడికి సాదిక్ దగ్గర షూటింగ్ […]

Kakinada Sowjanya family case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ నగరానికి చెందిన పంచాయతీరాజ్ ఏఈ టీ నూకరాజు కుటుంబం ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. నూకరాజు.. ఆయన భార్య.. కుమార్తె సౌజన్య.. మనవడు అందరూ కలిసి గోదావరిలో దూకారు. వీరిలో సౌజన్యకుమారుడు బతికాడు.

ఈ వ్యవహారంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో సాదిక్ పాత్ర బయటపడింది. సౌజన్యకు జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు. సౌజన్య తన కుమారుడికి సాదిక్ దగ్గర షూటింగ్ నేర్పించేది. ఈ క్రమంలో సాదిక్ ఆమెకు దగ్గరయ్యాడు. ఇద్దరు సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలను.. ఫోటోలను తీశాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. సౌజన్యకు దాదాపు 25 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. పైగా నూకరాజుకు సౌజన్య ఒక్కతే కుమార్తె.

ఆమె ఆస్తి మీద కన్ను వేసిన సాదిక్.. సౌజన్య భర్తను చంపాలి అనుకున్నాడు. ఈ క్రమంలో జగదీశ్వర్ రెడ్డి కి విడతలవారీగా విష పదార్థాన్ని అతనికి తెలియకుండా ఇచ్చాడు. ఈ క్రమంలో జగదీశ్వర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యాడు. ఆ తర్వాత ఆ విష పదార్థాన్ని మరోసారి అతడు తాగే కొబ్బరి నీళ్లలో కలిపి ఇవ్వడంతో మరుసటి రోజు చనిపోయాడు. ఆ తర్వాత సాదిక్ సౌజన్యను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఆమె ఆస్తులను తన పేరు మీద రాయించుకోవడానికి ప్రయత్నించాడు. ఆస్తి కాగితాలు.. ఇతర పత్రాలు తన వద్ద ఉంచుకున్నాడు ఈ నేపథ్యంలో సౌజన్య మీద అనేకసార్లు భౌతిక దాడికి దిగాడు. ఆమె కుమారుడి సమక్షంలోనే తీవ్రంగా కొట్టాడు.

సాదిక్ వేధింపులు తట్టుకోలేక సౌజన్య ఈ విషయాన్ని తండ్రి నూకరాజుతో చెప్పింది. నూకరాజు తో కూడా సాదిక్ గొడవపడ్డాడు. పైగా సౌజన్య.. ఆమె కుమారుడిని మతం మారాలని.. ఖురాన్ చదవాలని ఇబ్బంది పెట్టేవాడు. దీంతో అతడి వేధింపులు తట్టుకోలేక సౌజన్య కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. అదృష్టవశత్తు ఆమె కుమారుడు బతికాడు. పోలీసుల విచారణలో ఈ విషయాలను సాధిక క వివరించాడు.. మరోవైపు సాదిక్ ఉపయోగించిన విష పదార్థానికి సంబంధించిన నమూనాలను పోలీసులు సీజ్ చేశారు.

సాదిక్ మొదటి నుంచి కూడా క్రూరమైన వ్యక్తిత్వం ఉన్న వాడు. సాదిక్ తనను కొడుతున్నాడని సౌజన్య అతని కుటుంబ సభ్యులకు చెబితే.. వారు అతనికి దూరంగా ఉండాలని ఆమెకు హితవు పలికారు. దీంతో ఆమెలో మరింత భయం పెరిగిపోయింది. దీనికి తోడు సౌజన్యను అతడు తీవ్రంగా కొట్టడం మొదలుపెట్టాడు. చివరికి కుమారుడి ముందే ఆమెను కొట్టడంతో తట్టుకోలేకపోయింది. అప్పటినుంచి ఆమెకు చనిపోవాలి అనిపించింది. చివరికి ఆమె చనిపోయే దారులను కూడా సాదిక్ మూసివేయడంతో మరింత కృంగిపోయింది. అందువల్లే నూకరాజు కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper