Homeఆంధ్రప్రదేశ్‌AE Nookaraju Family Suicide Case : ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో ఊహించని...

AE Nookaraju Family Suicide Case : ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో ఊహించని ట్విస్ట్!

AE Nookaraju Family Suicide Case : తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించింది కాకినాడలోని ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య. మత మార్పిడి వేధింపులు వల్లే ఆ కుటుంబం అఘాయిత్యానికి పాల్పడిందని.. దానికి కారణమైన సాధిక్ ను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆయన చర్యలను ముస్లింలు సైతం ఖండిస్తున్నారు. మరోవైపు ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోంది. అయితే […]

AE Nookaraju Family Suicide Case : తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించింది కాకినాడలోని ఏఈ నూకరాజు కుటుంబ ఆత్మహత్య. మత మార్పిడి వేధింపులు వల్లే ఆ కుటుంబం అఘాయిత్యానికి పాల్పడిందని.. దానికి కారణమైన సాధిక్ ను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆయన చర్యలను ముస్లింలు సైతం ఖండిస్తున్నారు. మరోవైపు ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోంది. అయితే ఈ కేసులో ఊహించని మలుపు. సాధిక్ తల్లి నూర్జహాన్ తొలిసారిగా మీడియం ముందుకు వచ్చి మాట్లాడారు . నూకరాజు కుటుంబం తన కుమారుడి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందన్న ఆరోపణలను ఆమె ఖండించారు. ఇది నిజం కాదని.. తన కుమారుడ్ని పెళ్లి చేసుకోవాలని సౌజన్య కోరింది అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ కేసులో ఇప్పుడు కొత్త మలుపు కనిపిస్తోంది.

* కీలక అంశాలు వెల్లడి..
నూర్జహాన్ మీడియా ముందుకు వచ్చి కీలక అంశాలను వెల్లడించారు. సౌజన్య తన ఇంటికి రెండుసార్లు వచ్చిందని.. సాదిక్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందని.. ఆ ప్రతిపాదనను తాము నిరాకరించిన విషయాన్ని కూడా తేల్చేశారు నూర్జహాన్. మరోవైపు జగదీశ్వర్ రెడ్డితో ఆమెకు పెళ్లి జరిగి ఉండకపోతే సాదిక్ కే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసే వాడిని ఆమె తండ్రి నూకరాజు స్వయంగా తమతో చెప్పినట్లు నూర్జహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌజన్య భర్త మృతితో తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న సౌజన్య ఫోన్ చేయడంతోనే సాదిక్ వెళ్లాడని.. అప్పట్లో జగదీశ్వర్ రెడ్డి తో పాటు అతని మనుషులు తన కొడుకు పై దాడి చేశారని.. కత్తి చూపించి బెదిరించారని నూర్జహాన్ ఆరోపించారు. భర్త జగదీశ్వర్ రెడ్డి సరిగ్గా చూసుకోక పోవడం వల్లే తన కుమారుడితో సౌజన్య సంబంధం పెట్టుకుందని ఆమె వెల్లడించారు.

* ఆరోపణల్లో నిజం లేదు..
బలవంతంగా మతమార్పిడి విషయంలో కూడా తన కుమారుడి ప్రమేయం లేదు అంటూ తేల్చి చెప్పారు నూర్జహాన్. తెలుగు ఖురాన్, బురఖా కావాలని సౌజన్య తమను అడిగినట్లు కూడా చెప్పుకొచ్చారు. వారు ఆత్మహత్య చేసుకున్న రోజు సాయంత్రం 5:30 గంటలకు సౌజన్య ఫోన్ చేసి రమ్మని పిలిచిందని.. సాత్విక్ స్థానికంగా అందుబాటులో లేడని తెలిపారు. నూకరాజు కుటుంబానికి చెందిన ఆస్తులు కానీ.. బంగారం కానీ తమ వద్ద లేవని.. తమ బ్యాంకు పాస్ బుక్ లు, ఆధార్ కార్డులను పోలీసులకు అప్పగించినట్లు వివరించారు. నూర్జహాన్ చెప్పిన అంశాలతో.. ఈ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. మున్మందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper