Homeటాప్ స్టోరీస్Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ

Media Owner : ఆ మీడియా అధినేత ఇంట్లో ఆస్తుల పంచాయితీ

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలను కూడా లెన్స్ వేసుకొని మరీ చూసే అలవాటు ఆ మీడియా అధినేతకు ఉంటుంది. ఆయనకు మీడియా సర్కిల్ లో మసాలా జర్నలిస్టు అనే పేరు కూడా ఉంది. ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు ఏకవాక్య సంబోధన చేయడం ఆయనకు అలవాటు. పైగా పిచ్చి పిచ్చి కూతలు కూయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఛానల్ పెట్టిన తొలి రోజుల్లో అర్ధరాత్రి పూట ఆ […]

Media Owner : ఎదుటి వాళ్ళ లైఫ్ లో జరిగే చిన్న చిన్న విషయాలను కూడా లెన్స్ వేసుకొని మరీ చూసే అలవాటు ఆ మీడియా అధినేతకు ఉంటుంది. ఆయనకు మీడియా సర్కిల్ లో మసాలా జర్నలిస్టు అనే పేరు కూడా ఉంది. ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు ఏకవాక్య సంబోధన చేయడం ఆయనకు అలవాటు. పైగా పిచ్చి పిచ్చి కూతలు కూయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

ఆయన ఛానల్ పెట్టిన తొలి రోజుల్లో అర్ధరాత్రి పూట ఆ తరహా సన్నివేశాలు.. వీడియోలు ప్లే చేసి రేటింగ్స్ పెంచుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది నేతల అక్రమ పడక వ్యవహారాలను కూడా ఆయన బయటపెట్టాడు. మొత్తానికి తనను మసాలా జర్నలిస్ట్ అని ఎందుకంటారో అనేక సందర్భాలలో నిరూపించుకున్నాడు.

చాలామందికి నీతులు చెప్పే ఈయన సరిగా కొంతకాలం క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత సంసారం కూడా మొదలుపెట్టాడు. 60 ఏళ్ళు దాటినప్పటికీ తాను ఇంకా నిత్యం మన్మధుడిని అనుకుంటూ.. సంసార యాత్ర సాగిస్తున్నాడు. ఎక్కడో శంషాబాద్ ప్రాంతంలో ఓ ప్రింటర్ కు చెందిన ఫామ్ హౌస్ లో రెండవ భార్యతో సుఖ సంసారం దర్జాగా మొదలుపెట్టాడు. అప్పట్లోనే ఆస్తుల సంబంధించి ఈయన ఇంట్లో పంచాయితీ వచ్చింది.

ఇటీవల హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఈయన ఏడు అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. కింది భాగంలో పత్రిక. పై భాగంలో ఛానల్ అన్నట్టుగా రూపకల్పన చేసుకున్నాడు. కానీ ఇక్కడే రెండో భార్య ఎంట్రీ ఇచ్చింది. ఆ బిల్డింగ్లో తనకు కూడా వాటా కావాలని పేచీ పెట్టింది. దీంతో ఆయన ఇంట్లో మళ్లీ ఆస్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రెండో భార్య అగ్గిమీద గుగ్గిలం కావడంతో పాపం ఆ మీడియా అధినేతకు చుక్కలు కనిపించాయి. ఇంకేముంది ఈ పంచాయతీని పరిష్కరించడానికి తన కులానికి చెందిన వారిని పిలిపించాడు. ఇంట్లోనే చర్చలు మొదలుపెట్టాడు. మొత్తానికి అమరావతి లోని సిఆర్డిఏ పరిధిలో ఉన్న ప్లాట్లను ఇవ్వడానికి ఆయన ఓకే చెప్పడంతో రెండో భార్య అలకపాన్పు దిగింది.

ఇక హైదరాబాదులోని ఖరీదైన ప్రాంతంలో కట్టిన ఆ బిల్డింగ్ లో కింది భాగం లో ఉన్న మూడు అంతస్తులు కుమారుడికి.. పై భాగంలో ఉన్న మూడు అంతస్తులు కుమార్తెకు అన్నట్టుగా రాసిచ్చాడు. పైన ఉన్న ఒక అంతస్తులో మాత్రం తాను ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. మొత్తానికి రెండో భార్యను చేసుకోవడం.. ఆస్తుల వ్యవహారంలో పంచాయతీలు కావడంతో.. సదరు మీడియా అధినేతకు శిరోభారం పెరిగిపోయింది. తట్టుకోలేక కొద్దిరోజులుగా అతను అమరావతిలోనే తిరుగుతున్నాడు. ఇంత చదివిన తర్వాత.. ఆ మీడియా అధినేత ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper