Bigg Boss 10 Telugu: ‘అగ్ని పరీక్ష 2’ లో ప్రేక్షకుల నుండి మంచి మార్కులు సంపాదించుకున్న కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే , అందులో ఝాన్సీ కూడా ఉంటుంది. ఎందుకంటే రైతు బిడ్డ అనే బ్యాక్ డ్రాప్ తో వచ్చింది కాబట్టి , టాస్కులు బాగా ఆడింది కాబట్టి. అయితే ఈమె బిగ్ బాస్ హౌస్ లో కచ్చితంగా ఉండాలని కోరుకున్న ప్రేక్షకులు , ఇప్పుడు ఈమె ఎలిమినేషన్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ చివర్లో ప్లే చేసిన ప్రోమో ని మీరంతా చూసే ఉంటారు. ఈ ప్రోమో లో నిర్వహించిన టాస్క్ లో , ఝాన్సీ అందరికంటే ముందుగా అవుట్ అవుతుందట. ఈ విషయం సోషల్ మీడియా లో లీకైన వెంటనే ఆడియన్స్ సంబరాలు చేసుకున్నారు. దీన్ని బట్టీ అర్థం చేసుకోవచ్చు ఈమెపై ఎంతటి నెగెటివిటీ ఉంది అనేది.
ఇక నిన్న అయితే ఝాన్సీ ని హాట్ స్టార్ లైవ్ లో చూసిన ఆడియన్స్ కి రక్తం మరిగిపోయింది అనే చెప్పాలి. డేంజర్ జోన్ లో ఉన్న చరణ్, ఝాన్సీ వద్దకు వచ్చి , దయనీయమైన ముఖం తో , ఏడుస్తూ , దయచేసి నాకు సపోర్ట్ చెయ్యి ఝాన్సీ అని వేడుకుంటాడు. కానీ ఝాన్సీ సపోర్ట్ చేయడు. ఝాన్సీ , చరణ్ కి మధ్య 22 రోజుల అగ్ని పరీక్ష షో పరిచయం ఉంది. ఇద్దరూ చాలా క్లోజ్. అయినప్పటికీ కూడా హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత అగ్ని పరీక్ష 2 వాళ్ళతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. వాళ్ళ టీం లో ఉంటూనే , వాళ్ళ ప్లాన్స్ అన్నిటిని ప్రత్యర్థి టీం కి అందించింది. ఇలాంటి పనులు చాలానే చేస్తూ వచ్చింది ఝాన్సీ. అయితే నిన్నటి ఎపిసోడ్ లో ఒక పక్క ఝాన్సీ కి , మరోపక్క కృష్ణుడు కి రోహిత్ ఇచ్చి పారేసాడు అనే చెప్పాలి.
రోహిత్ మాట్లాడిన మాటలకు ఇద్దరి నోటి నుండి సమాధానం లేదు. కృష్ణుడు ని నేను తక్కువ చేశానంటూ ప్రతీ ఒక్కరికి వెళ్లి చెప్తున్నాడు, నాకు చెప్పలేదు, ఈ విషయాన్ని స్వయంగా ఝాన్సీ నే నాతో చెప్పింది అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్. మొదట్లో నేనేమి నీకు చెప్పలేదు అంటూ బుకాయించిన ఝాన్సీ , ఆ తర్వాత ఆమెనే చెప్పాను అని ఒప్పుకునేలా చేసాడు రోహిత్. ఇక ఆ తర్వాత కృష్ణుడు కి సంస్కారం విషయం లో రోహిత్ ఇచ్చిన కోటింగ్ కి అతని నోటి నుండి కూడా మాట రాలేదు. ఓవరాల్ గా ఆడియన్స్ లో విపరీతమైన నెగెటివిటీ ని పెంచుకున్న ఈ ఇద్దరికీ రోహిత్ చుక్కలు చూపించడం చాలా బాగా అనిపించింది.