Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan: చంద్రబాబుపై ఉపాధ్యాయులను ఉసిగొల్పుతున్న జగన్!

YS Jagan: చంద్రబాబుపై ఉపాధ్యాయులను ఉసిగొల్పుతున్న జగన్!

YS Jagan: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిబంధనల వల్ల ఉపాధ్యాయులు బాధపడుతున్నారు. అయితే ఈ నిబంధన తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. 2011 కంటే ముందు నుంచి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా తప్పనిసరి చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో టెట్ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఈ విషయంలో ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి […]

YS Jagan: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిబంధనల వల్ల ఉపాధ్యాయులు బాధపడుతున్నారు. అయితే ఈ నిబంధన తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. 2011 కంటే ముందు నుంచి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా తప్పనిసరి చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో టెట్ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఈ విషయంలో ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు మంత్రి నారా లోకేష్. కానీ జాతీయస్థాయిలో తీసుకున్న నిర్ణయం కావడంతో 2011 కంటే ముందు నియామకం అయిన ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాల్సిందే అన్నట్టు కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది. అయితే తాజాగా దానిని తప్పుపడుతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు తప్ప.. కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనడం లేదు.

* సుదీర్ఘ పోస్ట్..
తాజాగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిబంధనల వల్ల.. ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. 2011 కంటే ముందు నుంచి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు తప్పనిసరి చేయడానికి తప్పు పట్టారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలంటూ సూచన చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ చూస్తే రెండు రకాల సందేహాలతో పాటు ఆయన పైనే అనుమానాలు వ్యక్తం ఎలా ఉన్నాయి పరిణామాలు. ఒకటి ఆయన అసెంబ్లీకి రారు. అందుకే ఆ సూచన ను పరిగణలోకి తీసుకోనవసరం లేదు. ఆపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా ఆయన అనలేదు. దీంతో రాజకీయ దురుద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు అర్థం అవుతుంది.

* కేంద్రం ఆదేశాలతోనే..
జాతీయ విద్యా హక్కు చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఈ నిబంధనను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేస్తున్నాయి. అయితే దీనిని చంద్రబాబు పై నెట్టేందుకు జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని.. పూర్తిగా కేంద్ర చట్టాలకు లోబడి ఒక సున్నితమైన విద్యావ్యవస్థపరమైన అంశాన్ని పట్టుకొని.. చంద్రబాబును అందించడం జగన్ పొలిటికల్ స్ట్రాటజీ లో భాగమే అని స్పష్టం అవుతుంది. ఉపాధ్యాయుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నేరుగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తే సరిపోయేది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయడం లేదు. కేంద్రంలో ఉన్న పెద్దలను నేరుగా ప్రశ్నిస్తూ ఆ చట్టంలో మార్పులు, రూల్స్ పై సలహాలు ఇవ్వచ్చు కదా. కానీ ఆ పని చేయడం లేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఉపాధ్యాయులు పడిన బాధలు అన్ని ఇన్ని కావు. ఇదే టెట్ నిబంధనలపై ఉపాధ్యాయులు న్యాయస్థానాల చుట్టూ తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉపాధ్యాయులను ఉసిగొల్పాలన్న ప్రయత్నం తప్ప అందులో ఏం కనిపించడం లేదు. ఉపాధ్యాయులకు సైతం తెలుసు ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధన అని.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper