Homeఆధ్యాత్మికంToday 9 July 2026 Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు ధన ప్రవాహం.....

Today 9 July 2026 Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు ధన ప్రవాహం.. వ్యాపారులకు అన్ని విజయాలే..

Today 9 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై అశ్విని నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు అనుకోకుండా ధన పండుగ జరిగే అవకాశం ఉంటుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే ఉంటాయి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది. ఉన్నట్లుండి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేస్తారు. విద్యార్థులకు గురువుల మద్దతుతో పరీక్షల్లో కలిసి వస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ పై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఇంట్లో జరిగే శుభకార్యం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు తోటి వారి సహకారం ఉండడంతో ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెడతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. గతంలో కంటే ఇప్పుడు లాభాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని పనుల్లో విజయం విజయం ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొన్ని పనులలో ఉత్సాహంగా చేస్తూ పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ప్రియమైన వారి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. వారి కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. కొత్తగా పెట్టుబడును పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తికాకపోవచ్చు. ఇలాంటి సమయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఊహించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. కొన్ని పనులు పూర్తి కావడానికి ఇతరుల సహకారం తీసుకుంటారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. వ్యాపారులు తీసుకొని నిర్ణయాలతో వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయం కావడంతో పెట్టుబడులను పెంచుకుంటూ పోతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు సానికూరమైన ఫలితాలు రానున్నాయి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు లాభాలు ఉంటాయి. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొత్త వస్తువుల కొనుగోలును నిలిపివేసుకోవడమే మంచిది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రత్యేకమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తమ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇతరుల సహకారం ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు లాభాలు పొందుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి సహకారంతో అప్పులను తీరుస్తారు. గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. వ్యాపారులకు అన్నీ కలిసి వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఇదే మంచి సమయం. పిల్లల కెరీర్ విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆరోగ్యం స్థిరంగా కొనసాగుతుంది. గతంలో మొదలు పెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులను ఇతరులకు అప్పగించద్దు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. విదేశాలతో వ్యాపారం చేసేవారికి ఇదే మంచి సమయం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular