spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan Sharmila: జగన్, షర్మిల.. మధ్యలో ఓ స్టార్ హీరో.. అసలు నిజం బయటపడింది

Jagan Sharmila: జగన్, షర్మిల.. మధ్యలో ఓ స్టార్ హీరో.. అసలు నిజం బయటపడింది

Jagan Sharmila: గత కొద్ది రోజులుగా జగన్, షర్మిల మధ్య గొడవలు ముదిరి పాకానపడినట్లుగా తెలుస్తున్నాయి. జగన్ సీఎం అయినప్పటి నుంచే వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. అది రాను రాను మరింత పెరిగిపోయిందనేది అందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్య వీరి మధ్య ఆస్తుల గొడవ మరింత రచ్చ అయింది. చివరకు తల్లి విజయమ్మ సైతం బహిరంగ లేఖ రాసే పరిస్థితి ఏర్పడింది. గతంలో వైఎస్ ఉన్నప్పుడు ఆస్తుల పంపకాలపై చెప్పిన విషయాలను విజయమ్మ తన లేఖ ద్వారా స్పష్టం చేశారు. అప్పుడు వైఎస్ ఏ ఆస్తులు ఎవరికి ఇవ్వాలని అనుకున్నారో పూసగుచ్చినట్లుగా విజయమ్మ తన లేఖ ద్వారా వెల్లడించారు. ఇద్దరి పిల్లలకు సమాన వాటాలు ఇవ్వాలని వైఎస్సార్ అనుకున్నట్లుగానూ తెలిపారు.

ఇక.. ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టిన జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ టాలీవుడ్ హీరోతో తనకు సంబంధం ఉందని బాలకృష్ణ ప్రచారం చేయించాడని షర్మిల ఆరోపించినట్లు జగన్ తెలిపారు. దానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను సైతం జగన్ ప్రదర్శించారు. అయితే.. తాజాగా షర్మిల ఆ వ్యాఖ్యలపై స్పందించారు. అసలు ఆ పనిచేయించింది జగన్ రెడ్డేనని సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సైతాన్ సైన్యంతోనే తనకు ఓ హీరోతో సంబంధం ఉందని ప్రచారం చేయించారని ఆరోపించారు. తనకు ఎవరితో ఎలాంటి రిలేషన్ లేదని అప్పుడు తన పిల్లలపై ఒట్టు కూడా వేశానని భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు కూడా ఒట్టు వేస్తున్నానని ఆవేదన చెందారు.

2019 ఎన్నికలకు ముందు తెలంగాణ పోలీసుల సాయంతో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేయడానికి వైసీపీ కార్యకర్తలే ఫేక్ అకౌంట్లతో ఓ హీరోతో షర్మిలకు రిలేషన్ అంటగట్టారు. దానిపై ఆ సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు. దాంతో అప్పటి నుంచే షర్మిల ఈ విషయంలో క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు వాటిని ఇష్టారీతిన షేర్ చేశారు. కామెంట్లు కూడా చేశారు. దాంతో షర్మిల హైదరాబాద్‌లో ఫిర్యాదులు ఇప్పించారు. పోలీసులు స్పందించి చాలా మందిని అరెస్టులు కూడా చేశారు. ఎన్‌బీకే బిల్డింగ్ నుంచే పోలీసులు పెట్టినట్లు ఆరోపించారు.

అయితే.. ఇప్పుడు అదే క్లిప్పింగును తీసుకొచ్చి జగన్ రాజకీయం చేయాలని ప్రయత్నం చేశారు. కానీ.. తాజాగా షర్మిల వాటిని తిప్పికొట్టారు. దీంతో అప్పుడు ఇప్పుడు తన సొంత చెల్లిపై తప్పుడు ప్రచారం చేసినట్లుగా ఆరోపించడం సంచలనమైంది. మరోవైపు.. అదానీ లంచాల వ్యవహారంపైనా షర్మిల స్పందించారు. జగన్ రెడ్డి లంచాలు తీసుకున్నారని, లంచాలు ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారా అని నిలదీశారు. జగన్, అదానీ కలిసి దేశం పరువు తీశారని మండిపడ్డారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే అమెరికా ఏజెన్సీలు కేసులు పెట్టాయని, అదానీని విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. జగన్‌ను, అదానీని ఇద్దరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...
Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper