BSNL Independence Day Offer: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకోవడానికి తగ్గంపు ధరలను ప్రకటిస్తూ ఉంటాయి. అయితే తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ అయితన బీఎస్ఎన్ఎల్ ప్రత్యేకంగా ఫ్రీడమ్ ఆఫర్ ను ఇప్పటికే ప్రకటించింది. అయితే దీనికి మంచి స్పందన రావడంతో గడువును మరింతగా పొడిగించారు. ఈ ప్రత్యేక ఆఫర్లో ఏమున్నాయో చూద్దాం..
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన ‘ఫ్రీడమ్ ఆఫర్’లో భాగంగా కొత్తగా బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకునే కస్టమర్లకు సిమ్ ను కేవలం ఒక రూపాయికే అందిస్తోంది. ఈ సిమ్ 24 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కాలంలో ప్రతిరోజూ 1 జీబీ డేటా, 100 మెసేజ్ లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాలు ఉంటాయి. అంటే 24 రోజుల వ్యవధిలో మొత్తం 24 జీబీ డేటాను వాడుకోవచ్చు.
రోజువారీగా మొబైల్ డేటాను వినియోగించే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉండొచ్చు. సోషల్ మీడియా, వాట్సాప్, వెబ్ బ్రౌజింగ్, వీడియోలు వంటి అవసరాలకు రోజుకు 1 జీబీ డేటా అందుతుంది. అదే సమయంలో దేశీయ వాయిస్ కాలింగ్‌కు అన్‌లిమిటెడ్ సదుపాయం ఉండటంతో కాల్స్ ఎక్కువగా చేసే వినియోగదారులకు కూడా ప్రయోజనం ఉంటుంది.
ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ రూ.2,399 అందిస్తోంది. అయితే దీని ప్లాన్‌లో కూడా మార్పు చేసింది. సాధారణంగా 365 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌ను ఫ్రీడమ్ ఆఫర్‌లో భాగంగా ఏకంగా 412 రోజులకు పెంచింది. అంటే సాధారణ వ్యాలిడిటీపై అదనంగా 47 రోజులు ఉచితంగా లభిస్తున్నాయి.ఈ ప్లాన్ లో రోజుకు 2 జీబీ హైస్పీడ్ డేటా, 100 మెసేజ్ లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు కొనసాగుతాయి.
అయితే ఈ ప్రత్యేక ఫ్రీడమ్ ఆఫర్ ఇప్పటి వరకు ఆగస్టు 12 వరకు మాత్రమే ఉండేది. దీనిని సెప్టెంబర్ 12 వరకు పెంచారు. తక్కువ ఖర్చుతో మొబైల్ వినియోగించాలని అనుకువారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మరోవైపు ఏడాది మొత్తం రీచార్జ్ గురించి ఆలోచించకుండా ఉండాలనుకునే వారికి రూ.2,399 ప్లాన్ ఆకర్షణీయంగా ఉంటుంది.